Jio Price Hike: సడెన్ షాక్.. మరోసారి రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన జియో..!

Jio Price Hike
x

Jio Price Hike

Highlights

Jio Price Hike: రిలయన్స్ జియో తన రెండు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ధరలను పెంచింది. ఇవి 84 వాలిడిటీతో వస్తాయి.

Jio Price Hike: టెలికాం దిగ్గజం రిలయ్స్ జియో తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తన ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను మరోసారి పెంచింది. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లను ఖరీదైనవిగా చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే రెండు రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసింది. ఇంతకముందు కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.1,099 ,రూ. 1499. అయితే ఇప్పుడు ఈ ప్యాక్‌లు కాస్ట్‌లీగా మారాయి. ఈ క్రమంలో ఈ ప్లాన్ కొత్త ధరలు, బెనిఫిట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

రిలయన్స్ జియో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్స్
జియో కంపెనీ ప్రీపెయిడ్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోలో 2 ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లు నెట్‌ఫ్లిక్స్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. ఇంతకు ముందు ఈ ప్లాన్‌ల ధర రూ.1,099, రూ.1,499. అయితే ఇప్పుడు కంపెనీ రెండు ప్లాన్‌ల ధరలను పెంచింది. రూ.1,099 ప్లాన్‌ రూ.200 పెరిగింది. ఇప్పుడు మీరు ఈ ప్లాన్‌ని రూ. 1,299కి పొందుతారు. మరోవైపు రూ.1,499 ప్లాన్ రూ.300 పెరిగి, రూ.1,799గా మారింది.

జియో రూ. 1,299 ప్లాన్
ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాల గురించి మాట్లాడితే రూ. 1,099 జియో ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ప్లాన్‌లో వినియోగదారులు 2GB డేటాకు యాక్సెస్ పొందుతారు. అలాగే ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 100 ఉచిత SMSలను పంపవచ్చు. ఈ ప్లాన్ మీకు ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది.

జియో రూ. 1,799 ప్లాన్
రూ.1,799 ప్లాన్ వాలిడిటీ కూడా 84 రోజుల వరకు ఉంటుంది. అయితే ఇందులో లభించే ప్రయోజనాలు వేరు. ఈ ప్లాన్ వినియోగదారులకు ప్రతిరోజూ 3GB డేటాను యాక్సెస్ చేస్తుంది. 84 రోజుల వాలిడిటీ ప్రకారం ఈ ప్లాన్ మీకు 252GB డేటాకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది. అలానే మీరు ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 SMSలను పంపవచ్చు. ఈ ప్లాన్ మీకు నెట్‌ఫ్లిక్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories