Redmi Watch: ఇండియాలో రెడ్‌మీ వాచ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా...!

Redmi Watch To Launch On May 13th Along With Redmi Note 10s
x

రెడ్ మీ వాచ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Redmi Watch: రెడ్‌మీ నోట్ 10ఎస్ ఫోన్ ఇండియాలో మే 13న రిలీజ్ కానుంది. దీంతోపాటు రెడ్ మీ వాచ్ కూడా విడుదల కానుంది.

Redmi Watch: రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో మే 13న రిలీజ్ కానుంది. దీంతోపాటు రెడ్ మీ వాచ్ కూడా విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ చైనాలో 2020 నవంబర్‌లోనే రిలీజ్ అయింది.

దీనికి సంబంధించిన కొత్త టీజర్ కూడా రెడ్‌మీ ఇండియా పేజీలో #WearYourVibe హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేసింది. ఈ ఫోన్ వాచ్, స్ట్రాప్ లుక్‌ను ఆ వీడియోలో చూపించారు. రెడ్‌మీ బ్రాండింగ్‌తో మనదేశంలో రిలీజ్ అయ్యే తొలి స్మార్ట్ వాచ్ ఇదే కానుంది.

ఈ ఫోన్ ధరను చైనాలో 299 యువాన్లుగా(సుమారు రూ.3,400) ఉంది. ఇండియాలో దీని ధరను ఇంకా వెల్లడించలేదు. ఎలిగెంట్ బ్లాక్, ఇంక్ బ్లూ, ఇవోరీ వైట్ రంగుల్లో ఈ వాచ్ లభించనుంది. చెర్రీ బ్లాసం, ఎలిగెంట్ బ్లాక్, ఇంక్ బ్లూ, ఇవోరీ వైట్ రంగుల్లో స్ట్రాప్ అందుబాటులో ఉన్నాయి.

ఈ వాచ్‌లో 1.4 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను తో రానుంది. అలాగే బ్లూటూత్ 5.0, దాదాపు 120 వాచ్ ఫేసెస్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 5.0, ఆ పైబడిన, ఐవోఎస్ 10.0+ ఆ పైబడిన ఫోన్లకు ఈ వాచ్‌ను పెయిర్ చేసుకోవచ్చు. 230 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ వాచ్ పనిచేయనుంది. ఇందులో బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్ అందించారు. అలాగే కాల్ నోటిఫికేషన్, మెసేజ్ రిమైండర్, అలారం రిమైండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories