Redmi Note 14s: 200MP కెమెరాతో సైలెంట్‌గా వచ్చింది.. ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ హల్ చల్ చేస్తుంది..!

Redmi Note 14s
x

Redmi Note 14s: 200MP కెమెరాతో సైలెంట్‌గా వచ్చింది.. ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ హల్ చల్ చేస్తుంది..!

Highlights

Redmi Note 14s: షియోమీ సబ్ బ్రాండ్ 'Redmi Note 14s' కొత్త స్మార్ట్‌ఫోన్‌గా ఆవిష్కరించింది, ఇది 4G కనెక్టివిటీతో వస్తుంది. ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G99-అల్ట్రా చిప్‌సెట్‌ ఉంటుంది.

Redmi Note 14s

షియోమీ సబ్ బ్రాండ్ 'Redmi Note 14s' కొత్త స్మార్ట్‌ఫోన్‌గా ఆవిష్కరించింది, ఇది 4G కనెక్టివిటీతో వస్తుంది. ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G99-అల్ట్రా చిప్‌సెట్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్ వెర్షన్‌లో నడుస్తుంది. 200-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 6.67-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP64 రేటింగ్, 67W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ అందించారు. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 16MP కెమెరా ఉంది. ఇప్పుడు మిగిలిన వివరాలను తెలుసుకుందాం.

Redmi Note 14s Price

చెక్ రిపబ్లిక్‌లో Redmi Note 14s ధర PLN 5,999 (సుమారు రూ. 22,700)గా నిర్ణయించారు. అయితే, ఉక్రెయిన్‌లో ఈ హ్యాండ్‌సెట్ PLN 10,999 (సుమారు రూ. 23,100)కి అందుబాటులో ఉంటుంది. అరోరా పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో రెండు దేశాలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Redmi Note 14s Features And Specifications

డ్యూయల్-సిమ్ సపోర్ట్‌తో రెడ్‌మీ నోట్ 14s ఆండ్రాయిట్ వెర్షన్‌లో నడుస్తుంది. ఇది నిజానికి Redmi Note 13 Pro 4G రీబ్యాడ్జ్ వెర్షన్. స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్‌తో 6.67-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే ఉంటుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G99-అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెడ్‌మీ నోట్ 13 ప్రో 4జీలో కూడా ఉంది. ఫోన్ ఒకే 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది.

ఫోటోలు, వీడియోల కోసం 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇందులో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ విషయానికి వస్తే... 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.2, NFC, GPS , USB టైప్-సి పోర్ట్‌లు ఉన్నాయి. హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలానే బ్యాకప్ కోసం 67W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories