Redmi K90 Ultra: రెడ్మీ నుంచి రాక్షస ఫోన్.. 10,000mAh బ్యాటరీతో Redmi K90 Ultra.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!


Redmi K90 Ultra: రెడ్మీ నుంచి రాక్షస ఫోన్.. 10,000mAh బ్యాటరీతో Redmi K90 Ultra.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Redmi K90 Ultra: షియోమీ సబ్-బ్రాండ్ రెడ్మీ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో మరో సంచలనానికి తెరలేపుతోంది.
Redmi K90 Ultra: షియోమీ సబ్-బ్రాండ్ రెడ్మీ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో మరో సంచలనానికి తెరలేపుతోంది. గతేడాది అక్టోబర్‌లో లాంచ్ అయిన Redmi K90 Pro Max ఇప్పటికే మార్కెట్‌లో దుమ్మురేపుతుండగా, ఇప్పుడు దానికి బాప్ లాంటి Redmi K90 Ultra త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతోంది. స్మార్ట్‌ఫోన్ లవర్స్ మధ్య ప్రస్తుతం దీని గురించే హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ కేవలం పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, కెమెరా, బ్యాటరీ విభాగాల్లో మనం ఊహించని రేంజ్ అప్‌గ్రేడ్స్‌తో రాబోతోంది. ముఖ్యంగా ఈ జనరేషన్ గేమర్స్, టెక్ గీక్స్‌ను టార్గెట్ చేస్తూ రెడ్మీ ఈ అల్ట్రా మోడల్‌ను డిజైన్ చేస్తోంది.
ఈ ఫోన్ పవర్‌హౌస్‌గా నిలిచేందుకు ఇందులో MediaTek Dimensity 9500 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించబోతున్నారు. ఇది హై-ఎండ్ గేమింగ్, మల్టీ-టాస్కింగ్‌ను వెన్నతో పెట్టిన విద్యలా డీల్ చేస్తుంది. హెవీ గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకంగా యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ సిస్టమ్‌ను కూడా తీసుకొస్తున్నారు. డిస్‌ప్లే విషయానికొస్తే, అల్ట్రా-హై రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.89 అంగుళాల LTPS OLED ప్యానెల్‌ను మనం చూడబోతున్నాం. అంటే స్క్రీన్ పై విజువల్స్ వెన్నలా స్మూత్‌గా సాగిపోతాయన్నమాట.
బ్యాటరీ విషయంలో రెడ్మీ ఒక అసాధ్యమైన ఫీచర్‌ను సుసాధ్యం చేయబోతోంది. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్లలో చూడని విధంగా ఏకంగా 10,000mAh బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చబోతున్నట్లు లీకులు అందుతున్నాయి. ఒకవేళ అది కుదరకపోయినా కనీసం 8,500mAh బ్యాటరీ ఉండటం మాత్రం పక్కా అని తెలుస్తోంది. దీనికి తోడు100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో, అంత పెద్ద బ్యాటరీ కూడా కళ్ళు మూసి తెరిచేలోపు ఫుల్ అయిపోతుంది. బ్యాటరీ అయిపోతుందనే భయం లేకుండా రోజుల తరబడి ఫోన్ వాడుకునే వెసులుబాటు ఈ అల్ట్రా మోడల్ కల్పిస్తుంది.
కెమెరా విభాగంలో కూడా ఈ ఫోన్ నెక్స్ట్ లెవల్ అనిపిస్తుంది. గత మోడల్స్‌తో పోలిస్తే ఇందులో భారీ సెన్సార్లను వాడుతున్నారు, ఇది ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఒక విజువల్ ట్రీట్ లాంటిది. 6.81 అంగుళాల నుండి 6.89 అంగుళాల మధ్య ఉండే భారీ డిస్‌ప్లే, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఫోన్‌ను ఒక మినీ థియేటర్ లాగా మార్చేస్తాయి. HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటం వల్ల మూవీ ఎక్స్‌పీరియన్స్ కూడా అదిరిపోతుంది. మొత్తానికి ఇది కేవలం ఒక ఫోన్ మాత్రమే కాదు, ఒక పవర్ ప్యాక్డ్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు.
ధర విషయానికొస్తే, గతంలో వచ్చిన Redmi K90 Pro Max చైనాలో సుమారు రూ.49,000 వద్ద లాంచ్ అయింది. ఈ అల్ట్రా మోడల్ అదనపు ఫీచర్లతో వస్తోంది కాబట్టి దీని ధర కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. 16GB RAM, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లతో ఈ ఫోన్ రిలీజ్ కానుంది. ఒక పక్కా ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం ఎదురుచూసే వారికి, అది కూడా రీజనబుల్ ప్రైస్‌లో కావాలనుకునే వారికి Redmi K90 Ultra ఒక బెస్ట్ ఆప్షన్ కాబోతోంది. ఇది గనుక మార్కెట్లోకి వస్తే మిగిలిన బ్రాండ్లకు చుక్కలు కనిపించడం ఖాయం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



