Redmi A3x: రూ. 6,999 రెడీ చేస్కోండి.. రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది..!

Redmi A3x
x

Redmi A3x 

Highlights

Redmi A3x: రెడ్‌మీ చౌకైన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ A3xని సేల్‌కి తీసుకొచ్చింది. రూ. 6,999కి కొనుగోలు చేయవచ్చు.

Redmi A3x: బడ్జెట్ ఫోన్లను టెక్ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో టాప్ కంపెనీలు పోడిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రెడ్‌మీ చౌకైన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ A3xని సేల్‌కి తీసుకొచ్చింది.రెడ్‌మీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేయగా, జులైలో అమెజాన్‌లో లిస్ట్ చేసింది. అయితే ఈ ఫోన్ రెడ్‌మీ అఫిషియల్ సైట్‌లో అందుబాటులోకి తీసుకురాలేదు. షియోమీ ఇండియా వెబ్‌సైట్‌లో కూడా ఫోన్ కనిపించడం లేదు. దీనికి సంబంధించి కంపెనీ అధికారిక సమాచారాన్ని త్వరలోనే వెల్లడించనుంది. దేశీయ మార్కెట్‌లో ఈ ఫోన్ ధర ఎంత ఉండొచ్చు. దాని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Redmi A3x Price (రెడ్‌మీ A3Xధర)
రెడ్‌మీ A3x అధికారిక సైట్‌లో రెండు వేరియంట్‌లలో లిస్ట్ అయింది. 3GB+64GB, 4GB+128GB. దీని ధర 3GB + 64GB వేరియంట్‌కు రూ. 6,999. 4GB + 128GB వేరియంట్‌కు రూ. 7,999. దీని బేస్ మోడల్‌ని మాత్రమే అమెజాన్‌లో సేల్‌కి తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ గ్రీన్, ఆలివ్ గ్రీన్, స్టార్రీ వైట్ వంటి కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Redmi A3x Specifications (రెడ్‌మీ A3x స్పెసిఫికేషన్లు)
రెడ్‌మీ A3x కొలతలు 168.4x76.3x8.3 mm, బరువు 193 గ్రాములు. ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉంది. డిస్ప్లే HD ప్లస్ (1650x720 పిక్సెల్స్) రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ ఉంటుంది. ఫోన్‌లో Unisock T603 ప్రాసెసర్, LPDDR4x RAM, eMMC 5.1 స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్ ప్రకారం ఫోన్ 3GB + 64GB, 4GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. మీరు మైక్రో SD కార్డ్‌తో 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

ఇది కాకుండా ఫోన్‌లో 8GB (4GB+4GB) RAM అదనంగా ఉంటుంది. సేఫ్టీ కోసం సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, AI ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది దాదాపు 24 రోజుల స్టాండ్‌బై , 30 గంటల కాలింగ్ టైమ్ అందిస్తుంది. దాదాపు 17 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది ఛార్జింగ్ కోసం, ఫోన్‌లో టైప్-సి ఇంటర్‌ఫేస్ ఉంది.

MIUI ఆధారంగా పనిచేసే ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌లో రెండు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. సెల్ఫీల కోసం దీనిలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. డ్యూయల్ సిమ్, 4జి, వై-ఫై, బ్లూటూత్ 5.4, జిపిఎస్, ఎఫ్ఎమ్ రేడియో, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, డెడికేటెడ్ మైక్రోఎస్‌డి కార్డ్ స్లాట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories