Realme 10 5G: రియల్‌మి నుంచి సరికొత్త 5G ఫోన్‌.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Realme Unveils Realme 10 5G Globally What are the Price Features
x

రియల్‌మి నుంచి సరికొత్త 5G ఫోన్‌

Highlights

Realme 10 5G: రియల్‌మి నుంచి సరికొత్త 5G ఫోన్‌.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Realme 10 5G: రియల్‌మి ప్రపంచవ్యాప్తంగా Realme 10 5Gని ఆవిష్కరించింది. ఇది డైమెన్సిటీ 700 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. దీనిని చైనాలో నిశ్శబ్దంగా ఆవిష్కరించారు. ఈ మొబైల్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే 90Hz LCD డిస్ప్లే, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో వస్తుంది.

Realme 10(5G) ధర

Realme 10 చైనాలో రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. 8 GB RAM + 128 GB స్టోరేజ్‌, 8 GB RAM + 256 GB స్టోరేజ్‌. ఈ రెండు మోడళ్ల ధర వరుసగా 1,299 యువాన్లు (సుమారు రూ.15 వేలు), 1,599 యువాన్లు (రూ.17,914). ఇది రిజిన్ డౌజిన్, స్టోన్ క్రిస్టల్ బ్లాక్ వంటి విభిన్న రంగులలో అందుబాటులో ఉంది.

Realme 10(5G)ఫీచర్లు

Realme 10 ఒక టియర్‌డ్రాప్ నాచ్‌తో 6.6-అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 20.06:9 యాస్పెక్ట్ రేషియో, 401 ppi పిక్సెల్ డెన్సిటీ, 400 nits బ్రైట్‌నెస్, 90.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను అందిస్తుంది. హుడ్ కింద ఇది USB-C పోర్ట్ ద్వారా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఇచ్చే 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఫోన్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.

Realme 10 (5G) కెమెరా

సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం Realme 10 ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. LED-బ్యాక్‌ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా 2-మెగాపిక్సెల్ మాక్రో, AI లెన్స్ ఉన్నాయి. కనెక్టివిటీ ముందు పరికరం డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5G, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.2, GPS, 3.5mm ఆడియో జాక్‌ని అందిస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories