Realme Narzo 80x 5G Launched: రియల్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త 5G ఫోన్ చూశారా..? ఫస్ట్ సేల్‌లో భారీ ఆఫర్లు..!

Realme Narzo 80x 5G Launched in India Check Price Specifications and Sale Details
x

Realme Narzo 80x 5G Launched: రియల్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త 5G ఫోన్ చూశారా..? ఫస్ట్ సేల్‌లో భారీ ఆఫర్లు..!

Highlights

Realme Narzo 80x 5G Launched: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి ఈరోజు భారతదేశంలో తన తాజా రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది.

Realme Narzo 80x 5G Launched: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి ఈరోజు భారతదేశంలో తన తాజా రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. 6000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.11,999కు లాంచ్ అయింది. ఈ రియల్‌మి నార్జో 80x 5జీ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Realme Narzo 80x 5G Offers

రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి వస్తుంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999. అయితే ఎస్‌బిఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి ధరను దాదాపు రూ. 2000 తగ్గించవచ్చు.

Realme Narzo 80x 5G First Sale

రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఫోన్ ఏప్రిల్ 11, 2025న సాయంత్రం 6:00 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ఇండియా, రియల్‌మి వెబ్‌సైట్,ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్‌ని రెండు ఆకర్షణీయమైన రంగులలో కొనుగోలు చేయవచ్చు. సన్‌లైట్ గోల్డ్, డీప్ ఓషన్.

Realme Narzo 80x 5G Features

రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD డిస్‌ప్లేతో వస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరుతో 50MP మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2MP అల్ట్రా వైడ్ లెన్స్‌ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వాటర్,డస్ట్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP69 రేటింగ్‌ బిల్డ్ అందించారు.

రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో వస్తుంది.స్మార్ట్‌ఫోన్ దాని ఆన్‌బోర్డ్ మెమరీని 6GB RAM + వర్చువల్ 6GB RAMకి విస్తరించుకునే అవకాశం ఉంది. దీని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్, జిపీఎస్, వైఫై, 3.5మిమీ ఆడియో జాక్, యూఎస్‌బి టైప్ సి , గెలీలియో సెన్సార్లు ఉన్నాయి. చివరగా, ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories