Realme C63: రూ. 9 వేలలోనే కళ్లు చెదిరే ఫీచర్లు.. రియల్‌మీ నుంచి స్టన్నింగ్‌ ఫోన్‌..!

Realme Launches New Budget Smart Phone Realme C63 Features and Price Details
x

Realme C63: రూ. 9 వేలలోనే కళ్లు చెదిరే ఫీచర్లు.. రియల్‌మీ నుంచి స్టన్నింగ్‌ ఫోన్‌..!

Highlights

Realme C63: ప్రస్తుతం మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్‌లను డిమాండ్‌ పెరుగుతోంది. దాదాపు అన్ని దిగ్గజ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌లను తీసుకొస్తున్నాయి.

Realme C63: ప్రస్తుతం మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్‌లను డిమాండ్‌ పెరుగుతోంది. దాదాపు అన్ని దిగ్గజ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా రూ. 10 వేలలోపు మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ సీ63 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా.

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ సీ63 పేరుతో సోమవారం కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లోనే అధునాతన ఫీచర్లను ఇందులో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ అమ్మకాలు జులై 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌, ఎంపిక చేసిన కొన్ని రిటైల్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ లభించనుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. ఎయిర్ గెశ్చర్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను జేడ్‌ గ్రీన్‌, లెదర్‌ బ్లూ కలర్స్‌లో తీసుకొచ్చారు. కొలాప్సబుల్ మినీ క్యాప్సూల్ ఫీచర్ తో నోటిఫికేషన్లు, అలర్ట్స్ చూడొచ్చు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 45 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ కేవలం 90 నిమిషాల్లోనే 100 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

ఇక రియల్‌మీ సీ63 ఫోన్‌ ఆక్టాకోర్‌ యూనిసోక్ టీ613 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో రియల్ మీ యూఐ 5 వర్షన్ ను అందిస్తున్నారు. ఐపీ54 రేటింగ్‌తో డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. కెమెరా పరంగా చూస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories