Realme 8 5G: రియల్ మీ 8 5జీలో నూతన వేరియంట్.. ధరెంతో తెలుసా?

Realme 8 5G 64GB Storage Variant Launches In India
x

రియల్ మీ 8  5 జీ (ఫొటో ట్విట్టర్)

Highlights

Realme 8 5G: ఇటీవలే రియల్‌మీ 8 5జీ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మోడల్‌లో నూతన వేరియంట్‌ను విడుదల చేసింది.

Realme 8 5G: ఇటీవలే రియల్‌మీ 8 5జీ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మోడల్‌లో నూతన వేరియంట్‌ను విడుదల చేసింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌ తో కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది.

4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999గా ఉంది. అలాగే 4 GB ర్యామ్ + 128 GB మోడల్ ధర రూ.14,999, 6 GB ర్యామ్ + 128 GB వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. సూపర్ సోనిక్ బ్లాక్, సూపర్ సోనిక్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉంది. మే 18న సేల్‌ కు రానుంది.

ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ తో వచ్చిన ఈ ఫోన్ ‎8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ను అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు స్టోరేజ్‌ ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో డీఆర్ఈ అనే కొత్త ఫీచర్ అందించారు. దీని ద్వారా మీ ఫోన్ స్టోరేజ్‌ను వర్చువల్ ర్యామ్‌గా మార్చుకునే అవకాశం ఉంది. దీంతో మీ స్మార్ట్‌ఫోన్ మరింత స్పీడ్‌గా పనిచేస్తుంది.

ఇందులో బ్యాక్‌సైడ్ 3 కెమెరాలు అందించారు. మెయిన్‌ కెమోరా 48 MPగా ఉంది. దీంతో పాటు 2 MP మోనోక్రోమ్ సెన్సార్, 2 MP టెర్టియరీ సెన్సార్ ను అందించారు. నైట్ స్కేప్, ప్రో మోడ్, ఏఐ స్కాన్, సూపర్ మాక్రో, 48 మెగాపిక్సెల్ మోడ్ వంటి ఫీచర్లను అందించారు. ఇక సెల్ఫీల కోసం ‎16 MP కెమెరా ఉంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై వర్క్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరితో పనిచేయనున్న ఈ ఫోన్ 18W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వీ5.1, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు లాంటి అదనపు సదుపాయాలను కలిగి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories