
POCO X8 Pro Max: 8550mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. మొబైల్ మార్కెట్‌లో పోకో సంచలనం!
చైనాకు చెందిన షావోమీ అనుబంధ సంస్థ 'పోకో'కు భారత మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ భారత టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది.
చైనాకు చెందిన షావోమీ అనుబంధ సంస్థ 'పోకో'కు భారత మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ భారత టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది. మార్కెట్‌లో అద్భుత ఫీచర్లకు గుర్తింపు పొందిన పోకో.. మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. పోకో ఎక్స్8 ప్రో (POCO X8 Pro), పోకో ఎక్స్8 ప్రో మాక్స్ (POCO X8 Pro Max) స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లను సంబంధించిన ప్రాసెసర్, బ్యాటరీ, ధరల వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు మిడ్-రేంజ్ నుంచి ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేయనున్నాయి.
పోకో ఎక్స్8 ప్రో ఫోన్ MediaTek Dimensity 8500 ప్రాసెసర్‌తో వస్తున్నట్లు సమాచారం. ఇది రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో మంచి పనితీరును అందించనుంది. బ్యాటరీ విషయంలో కూడా ఈ మొబైల్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో 6,500mAh భారీ బ్యాటరీ ఉండనున్నట్లు లీకులు చెబుతున్నాయి. 8GB RAM + 256GB వేరియెంట్ ధర భారత కరెన్సీలో దాదాపు రూ.43 వేలు (€399.90) ఉండనుంది. 8GB RAM + 512GB వేరియెంట్ ధర రూ.53 వేలు (€449.90)గా.. 12GB RAM + 512GB వేరియెంట్ ధర రూ.51 (€479.90)గా ఉండనుంది. ఈ ధరలో ఇలాంటి స్పెసిఫికేషన్లు రావడంతో POCO X8 Pro మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో బలమైన పోటీదారుగా నిలవనుంది.
ఇక పోకో ఎక్స్8 ప్రో మాక్స్ మోడల్ మరింత శక్తివంతంగా ఉండనుంది. ఇందులో Dimensity 9500s చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది హై-ఎండ్ పనితీరును అందించగల ప్రాసెసర్‌గా టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్‌లో ప్రధాన హైలైట్ బ్యాటరీనే. ఇందులో ఏకంగా 8,550mAh భారీ బ్యాటరీ ఇవ్వనున్నట్లు సమాచారం. దాంతో రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 12GB RAM + 256GB వేరియెంట్ ధర రూ. 57 (€529.90)గా.. 12GB RAM + 512GB వేరియెంట్ ధర రూ. 62 (€579.90)గా ఉండే అవకాశాలు ఉన్నాయి.
మొత్తంగా చూస్తే.. POCO X8 Pro సిరీస్ భారీ బ్యాటరీలు, కొత్త Dimensity ప్రాసెసర్లు, ఆకర్షణీయమైన ధరలతో మార్కెట్‌లో సంచలనం సృష్టించే అవకాశముంది. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే యూజర్లు, గేమింగ్ ప్రేమికులకు ఈ ఫోన్లు మంచి ఆప్షన్‌గా మారవచ్చు. అధికారిక లాంచ్ తర్వాత భారత మార్కెట్‌లో ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లు ఎలా ఉంటాయో చూడాలి.
- POCO X8 Pro
- POCO X8 Pro Max
- POCO X8 Pro Price
- POCO X8 Pro launch
- POCO X8 Pro camrera
- POCO X8 Pro specs
- POCO X8 Pro India launch
- POCO X8 Pro Max Launch
- POCO X8 Pro Max price
- POCO X8 Pro Max specs
- POCO X8 Pro Max battery
- POCO 8550mAh battery phone
- POCO 100W fast charging
- POCO Dimensity 9500s
- POCO Dimensity 8500
- POCO smartphones India
- POCO X8 Pro price
- POCO mobile leaks
- mid range flagship phones
- POCO X8 Pro Max with 8550mAh Battery and 100W Fast Charging
- POCO X8 Pro Leaks
- POCO X8 Pro Max Leaks

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




