Poco M7 5G: మార్కెట్లోకి పోకో కొత్త ఫోన్.. రూ.10 వేల బడ్జెట్‌లో కళ్లు చెదిరే ఫీచర్స్..!

Poco M7 5G
x

Poco M7 5G: మార్కెట్లోకి పోకో కొత్త ఫోన్.. రూ.10 వేల బడ్జెట్‌లో కళ్లు చెదిరే ఫీచర్స్..!

Highlights

Poco M7 5G: పోకో ఇండియా తన M7 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు దేశంలో విడుదల చేయనుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ ఫోన్‌లో చూడచ్చు.

Poco M7 5G: పోకో ఇండియా తన M7 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు దేశంలో విడుదల చేయనుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ ఫోన్‌లో చూడచ్చు. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ , బిల్డ్ వివరాలతో సహా రాబోయే హ్యాండ్‌సెట్ అనేక ఫీచర్లను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. డిసెంబర్ 2023లో భారతదేశంలో లాంచ్ అయిన Poco M6 5Gకి ఈ ఫోన్ అప్‌గ్రేడ్ వేరియంట్ అవుతుందని చెబుతున్నారు. ఇంతకుముందు కంపెనీ డిసెంబర్ 2024లో దేశంలో Poco M7 Pro 5Gని ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Poco M7 5G Price

పోకో M7 5జీ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. దేశంలో మార్చి 3న అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఫోన్ ధర రూ. 10,000 లోపు ఉంటుంది. హ్యాండ్‌సెట్ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కి వస్తుంది. ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్‌లో ఉంటుంది. అందులో మింట్ గ్రీన్, ఓషన్ బ్లూ, శాటిన్ బ్లాక్ ఉన్నాయి.

Poco M7 5G Features

పోకో M7 5జీలో 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 600నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో 6.88-అంగుళాల స్క్రీన్‌ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ పేజీ వెల్లడించింది. ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది, ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX852 సెన్సార్, LED ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ముందు, వెనుక కెమెరాలుే 30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ పోకో హ్యాండ్‌సెట్‌లో 5,160mAh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఫోన్ 18W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది, బాక్స్‌లో 33W ఛార్జర్‌ ఉంటుంది. ఈ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్ లేదా 56 గంటల వాయిస్ కాలింగ్‌ను అందించగలదని పోకో ఇండియా పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories