Poco F7 Ultra Launched: ఇది ఆల్ రౌండర్ మొబైల్.. మార్కెట్లోకి పోకో కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?

Poco F7 Ultra Launch Officially Expected Price and Specifications
x

Poco F7 Ultra Launched: ఇది ఆల్ రౌండర్ మొబైల్.. మార్కెట్లోకి పోకో కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?

Highlights

Poco F7 Ultra Launched: షియోమి సబ్ బ్రాండ్ పోకో త్వరలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాన్ మార్కెట్లో విడుదల చేయనుంది.

Poco F7 Ultra Launched: షియోమి సబ్ బ్రాండ్ పోకో త్వరలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాన్ మార్కెట్లో విడుదల చేయనుంది. Poco F7 Ultra పేరుతో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ అధికారికంగా వెల్లడించింది. బ్రాండ్ మార్చిలో ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో పోకో F7 అల్ట్రా, ప్రో మోడళ్లను విడుదల చేసింది. ఇప్పుడు పోకో ఈ హ్యాండ్‌సెట్‌ను దేశంలో కూడా విడుదల చేయబోతోందనే ఊహాగానాలు వస్తున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్‌లో బేస్ Poco F7 మోడల్‌గా కనిపించింది. స్మార్ట్‌ఫోన్ ముఖ్యమైన ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి.

Poco F7 Ultra Launch Date

పోకో ఇండియా హెడ్ హిమాన్షు టాండన్ ఒక X పోస్ట్‌లో భారతదేశంలో పోకో F7 అల్ట్రాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రోమో పోస్టర్‌ను షేర్ చేసి, "నాక్ నాక్!!" అనే క్యాప్షన్‌ రాశాడు. ఫోన్ ఫస్ట్ లుక్ కూడా రివిల్ అయింది. అలాగే, ఈ షేర్ చేసిన ఫోటోపై ఇలా వ్రాశారు - "అల్ట్రావిజన్ ప్రతిదీ చూస్తుంది."

అంతకుముందు, టాండన్‌ని X లో తన ఫాలోవర్స్ Poco F7 Pro, Poco F7 Ultra ని భారతదేశానికి తీసుకురావడాన్ని కంపెనీ పరిగణించాలా అని అడిగారని తెలిపారు. ఇప్పుడు వెలువడిన టీజర్, పోకో అల్ట్రా వేరియంట్‌ను భారత మార్కెట్‌కు తీసుకురావడానికి సిద్ధమవుతోందని సూచిస్తుంది.

Poco F7 Ultra Specifications

పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ F7 అల్ట్రా ఇప్పటికే ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయింది. భారత మార్కెట్లో కూడా ఈ హ్యాండ్‌సెట్ గ్లోబల్ వేరియంట్ మాదిరిగానే ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోకో ఎఫ్7 అల్ట్రా భారతదేశంలో లాంచ్ అయ్యే వరకు, దాని గ్లోబల్ వేరియంట్ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

పోకో ఎఫ్7 అల్ట్రా గ్లోబల్ వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC ప్రాసెసర్ ఉంది, ఇది 16GB + 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. పవర్ విషయానికొస్తే, 120W వైర్డు,50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,300mAh బ్యాటరీ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2 తో వస్తుంది. ఫోన్‌లో 6.67-అంగుళాల 120Hz WQHD+ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌. ఇందులో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అలాగే టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

Poco F7 Ultra Price

యూఎస్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ 12GB+256G, 16GB+512GB వేరియంట్ల ధరలు వరుసగా $599 (సుమారు రూ. 51,000), $649 (సుమారు రూ. 55,000)గా ఉంది. మొబైల్ బ్లాక్, ఎల్లో కలర్స్‌లో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తుంది. భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories