Perplexity: గూగుల్‌ క్రోమ్‌ కొనుగోలుకు పర్‌ప్లెక్సిటీ భారీ ఆఫర్‌

Perplexity: గూగుల్‌ క్రోమ్‌ కొనుగోలుకు పర్‌ప్లెక్సిటీ భారీ ఆఫర్‌
x

Perplexity: గూగుల్‌ క్రోమ్‌ కొనుగోలుకు పర్‌ప్లెక్సిటీ భారీ ఆఫర్‌

Highlights

కృత్రిమ మేధ (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్‌ పర్‌ప్లెక్సిటీ, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ఓపెన్ సోర్స్‌ వెబ్‌ బ్రౌజర్‌ ‘గూగుల్‌ క్రోమ్‌’ కొనుగోలుకు ఆసక్తి చూపించింది. అరవింద్‌ శ్రీనివాస్‌ నాయకత్వంలోని ఈ కంపెనీ, గూగుల్‌కు 34.5 బిలియన్‌ డాలర్లు ఆఫర్‌ చేసినట్టు సమాచారం.

కృత్రిమ మేధ (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్‌ పర్‌ప్లెక్సిటీ, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ఓపెన్ సోర్స్‌ వెబ్‌ బ్రౌజర్‌ ‘గూగుల్‌ క్రోమ్‌’ కొనుగోలుకు ఆసక్తి చూపించింది. అరవింద్‌ శ్రీనివాస్‌ నాయకత్వంలోని ఈ కంపెనీ, గూగుల్‌కు 34.5 బిలియన్‌ డాలర్లు ఆఫర్‌ చేసినట్టు సమాచారం. ఈ మొత్తం, పర్‌ప్లెక్సిటీ ప్రస్తుత కంపెనీ విలువ కంటే ఎక్కువ కావడం విశేషం. ప్రస్తుతం గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో, దాన్ని విక్రయించాలని అమెరికా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఈ పరిస్థితుల్లో పర్‌ప్లెక్సిటీ నుంచి వచ్చిన ఈ భారీ ఆఫర్‌ చర్చనీయాంశమైంది.

బ్లూమ్‌బర్గ్‌ కథనం ప్రకారం, ఈ డీల్‌ కోసం పర్‌ప్లెక్సిటీ బాహ్య పెట్టుబడిదారుల సాయం తీసుకోనుంది. ఇప్పటికే పలు పెట్టుబడిదారులు లావాదేవీకి అవసరమైన మొత్తం మొత్తాన్ని ఫైనాన్స్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ దిమిత్రి షెవెలెంకో తెలిపారు. ఇటీవలే జూలైలో పర్‌ప్లెక్సిటీ 100 మిలియన్‌ డాలర్ల ఫండింగ్‌ సమీకరించగా, ఆ సమయంలో కంపెనీ విలువ రూ.1.57 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. దాంతో పోలిస్తే, క్రోమ్‌ కోసం ఆఫర్‌ చేసిన మొత్తం దాదాపు రెండింతలేనని చెప్పాలి.

పర్‌ప్లెక్సిటీ ఈ ఆఫర్‌ను ‘టెక్‌ క్రంచ్‌’కు ధృవీకరించింది. క్రోమ్‌ కోర్‌ ఇంజిన్‌ అయిన ‘క్రోమియం’ను ఓపెన్ సోర్స్‌గా కొనసాగిస్తామని, ఏటా సుమారు 3 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. అలాగే డీల్‌ విజయవంతమైనా, పర్‌ప్లెక్సిటీని డిఫాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా మార్చే యోచన లేదని, గూగుల్‌ క్రోమ్‌నే కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

యాంటీ-ట్రస్ట్‌ ఒత్తిడి మధ్య గూగుల్‌

గూగుల్‌ క్రోమ్‌ విక్రయ ప్రణాళికలపై స్పష్టత లేకపోయినా, గూగుల్‌ మార్కెట్‌ గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునే క్రమంలో అనేక పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుందని, వాటి డివైజ్‌లలో గూగుల్‌ సెర్చ్‌ను డిఫాల్ట్‌గా ఉంచేందుకు చెల్లింపులు చేసిందని అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆరోపిస్తోంది. కొలంబియా డిస్ట్రిక్ట్‌ కోర్టు కూడా ఈ ఆరోపణలను నిజమని తేల్చింది. ఈ నేపథ్యంలో, క్రోమ్‌ను విక్రయించాలి, సెర్చ్‌ డేటాను పోటీదారులకు లైసెన్స్‌ ఇవ్వాలి, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యేక ప్రమోషన్‌ల కోసం చెల్లింపులను ఆపాలని అమెరికా ప్రభుత్వం సూచించింది.

పర్‌ప్లెక్సిటీ లక్ష్యం

కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే సెర్చ్‌ ఇంజిన్‌, చాట్‌జీపీటీ తరహా యాప్‌గా పేరుగాంచిన పర్‌ప్లెక్సిటీ, ప్రస్తుతం ‘కామెట్‌’ అనే బ్రౌజర్‌ను అందిస్తోంది. 2026 నాటికి పది కోట్ల నుంచి వందల కోట్ల యూజర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా పలు స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులతో చర్చలు జరుపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories