Oppo F27 Pro+: లాంచింగ్‌కు సిద్ధమైన ఒప్పో కొత్త సిరీస్.. ఫీచర్స్‌ మాములుగా లేవుగా..!

Oppo Launching New Smart Phone India Oppo F27 Pro+ Features and Price Details
x

Oppo F27 Pro+: లాంచింగ్‌కు సిద్ధమైన ఒప్పో కొత్త సిరీస్.. ఫీచర్స్‌ మాములుగా లేవుగా..!

Highlights

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది.

Oppo F27 Pro+: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి ఇటీవల బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మిడ్‌ రేంజ్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఒప్పో ఎఫ్‌27 ప్రో+ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఒప్పో ఎఫ్‌ 27 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి జూన్‌ 13వ తేదీన లాంచ్‌ చేయనున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో ఎఫ్‌27, ఒప్పో ఎఫ్‌27 ప్రో, ఒప్పో ఎఫ్‌27 ప్రో+ పేర్లతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం.

కాగా ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ప్రస్తుతం నెట్టింట కొన్ని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. అలాగే ఇందులో 120 హెచ్‌జెడ్‌తో కూడిన కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌తో పాటు 16 జీబీ ర్యామ్‌ వేరియంట్స్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ స్కానర్‌ను అందించనున్నారు. ఎప్పో ఎఫ్‌27 ప్రో+ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను ఐపీ69 వాటర్‌ రెసిస్టెంట్‌ రేటింగ్‌తో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ ధర రూ. 30,000లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories