Oppo A5x 5G Launch In India: ఒప్పో బడ్జెట్ ఫోన్ ఆగయా.. AI ఫీచర్స్‌, బిగ్ బ్యాటరీతో రూ.12,999కే మీ సొంతం..!

Oppo A5x 5G Launch In India With AI Camera and  6000mAh Battery
x

Oppo A5x 5G Launch In India: ఒప్పో బడ్జెట్ ఫోన్ ఆగయా.. AI ఫీచర్స్‌, బిగ్ బ్యాటరీతో రూ.12,999కే మీ సొంతం..!

Highlights

Oppo A5x 5G Launch In India: ఒప్పో భారత్‌లో కొత్త బడ్జెట్ ఫోన్ Oppo A5x 5Gని విడుదల చేసింది. Oppo A5x 5G హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 4జీబీ వరకు ర్యామ్, 128జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి.

Oppo A5x 5G Launch In India: ఒప్పో భారత్‌లో కొత్త బడ్జెట్ ఫోన్ Oppo A5x 5Gని విడుదల చేసింది. Oppo A5x 5G హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 4జీబీ వరకు ర్యామ్, 128జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది 1,000నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో 120Hz LCD స్క్రీన్‌ ఉంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ దాని మునుపటి మోడల్ కంటే 160 శాతం ఎక్కువ రెసిస్టెన్స్ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ రీన్‌ఫోర్స్డ్ గ్లాస్‌తో వస్తుంది. దీనికి IP65-రేటెడ్ బిల్డ్‌ను అందించారు. 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Oppo A5x 5G Price

ఈ స్మార్ట్‌ఫోన్ ధర 4GB + 128GB బేస్ కాన్ఫిగరేషన్ కోసం రూ.13,999 నుండి ప్రారంభమవుతుంది. ఇది రెండు కలర్స్‌లో అందుబాటులో ఉంది - మిడ్‌నైట్ బ్లూ, లేజర్ వైట్. ఈ ఫోన్ మే 25 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఎస్‌బిఐ, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, డిబిఎస్ బ్యాంక్ కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై వినియోగదారులు రూ.1,000 తక్షణ క్యాష్‌బ్యాక్, మూడు నెలల పాటు నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్‌ను పొందవచ్చు.

Oppo A5x 5G Specifications

డ్యూయల్-సిమ్ (నానో + నానో) Oppo A5x 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15 తో నడుస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల HD+ (1604 x 720 పిక్సెల్స్) LCD డిస్‌ప్లే ఉంది. దీనికి స్ప్లాష్ టచ్,యు గ్లోవ్ టచ్ టెక్నాలజీ ఉంది, తడి వేళ్లు, స్మడ్జ్‌లు, ఆయిల్ లేదా గ్లోవ్స్‌తో కూడా స్క్రీన్‌పై టచ్ పని చేయడానికి అనుమతిస్తుంది.

ఇది 6ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 4GB వరకు LPDDR4x ర్యామ్, 128జీబీ UFS 2.2 స్టోరేజ్‌ ఉంటుంది. ర్యామ్‌ని 4జీబీ వరకు విస్తరించవచ్చు. కంపెనీ దానిలో ట్రినిటీ ఇంజిన్‌ను కూడా అందించింది. దీనిని పనితీరును మెరుగుపరచడానికి రూపొందించారు.

కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఒప్పో A5x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 32-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (f/1.8 ఎపర్చరు, ఆటోఫోకస్‌తో) డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కెమెరా సిస్టమ్ అనేక AI ఫీచర్స్‌తో వచ్చింది.

కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G వోల్ట్, వైఫై 5, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్‌బి టైప్-C ఉన్నాయి. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MIL-STD షాక్ రెసిస్టెన్స్, SGS గోల్డ్ సర్టిఫికేషన్, IP65 డస్ట్ , వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది.

ఈ ఫోన్ 6,000mAh బ్యాటరీతో విడుదలైంది. ఇది 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ బ్యాటరీ 1,700 ఛార్జ్ సైకిళ్ల తర్వాత కూడా 80శాతం సామర్థ్యాన్ని నిలుపుకుంటుంది. 5 సంవత్సరాల పాటు మెరుగైన బ్యాటరీ పనితీరును అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories