OnePlus Turbo 6: వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దుమ్ములేపుతుంది..!

OnePlus Turbo 6: వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దుమ్ములేపుతుంది..!
x

OnePlus Turbo 6: వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దుమ్ములేపుతుంది..!

Highlights

ప్రముఖ చైనా కంపెనీ తన వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. OnePlus Turbo 6, OnePlus Turbo 6V పేర్లతో ఈ ఫోన్లను మార్కెట్లో దించనుంది.

OnePlus Turbo 6: ప్రముఖ చైనా కంపెనీ తన వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. OnePlus Turbo 6, OnePlus Turbo 6V పేర్లతో ఈ ఫోన్లను మార్కెట్లో దించనుంది. అయితే కంపెనీ లాంచ్‌కు ముందే స్క్వేర్ ఆకారపు కెమెరాలతో కూడిన రెండు ఫీచర్ ఫోన్‌ల డిజైన్‌లను ఇప్పటికే పరిచయం చేసింది. వన్‌ప్లస్ టర్బో 6కు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్‌ను, వన్‌ప్లస్ టర్బో 6Vకు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoCను జోడించినట్లు తెలుస్తోంది.

OnePlus Turbo 6 సిరీస్ ఈనెల 8న చైనాలో విడుదల చేయనున్నట్లు తాజాగా వీబో పోస్ట్ తెలిపింది. అలాగే కంపెనీ విడుదల చేయనున్న వన్‌ప్లస్ ఫోన్‌ల డిజైన్, కీలకమైన స్పెసిఫికేషన్లను కూడా ప్రత్యక్ష కార్యక్రమంలో ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్ ఫోన్ల ఫొటోలను చూసిన యూజర్లు విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ రెండు ఫోన్‌ల డిజైన్‌లు ఒకేలా ఉన్నట్లు కనిపిస్తోంది. డ్యూయల్ కెమెరా సిస్టమ్, LED ఫ్లాష్‌తో కూడిన స్క్వేర్ షేప్ కెమెరా ప్యానెల్ OnePlus Turbo 6, OnePlus Turbo 6V వెనుక భాగంలో ఉంది. ఈ ఫోన్‌లు ఒకే రకమైన కలర్ ఎడ్జెస్, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంటాయని టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే Turbo 6V బ్లాక్, సిల్వర్ కలర్స్‌లో, Turbo 6 బ్లాక్, సిల్వర్, టర్కోయిస్ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది.

తాజా నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ టర్బో 6 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ భద్రత కోసం IP68 + IP69 + IP69K రేటింగ్‌లతో రానుంది. UFS 4.1 ఇంటర్నల్ స్టోరేజ్ , LPDDR5X RAMని కలిగి ఉన్న స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్ ఫోన్‌కు శక్తినిస్తుందని తెలుస్తోంది. అలాగే, ఇది Android 16పై పనిచేస్తుంది. అడ్రినో 825 GPUని కలిగి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

వన్‌ప్లస్ టర్బో 6 8-MP సెకండరీ లెన్స్, 50-MP ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉండనుంది. ఇక వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే బయోమెట్రిక్ భద్రత కోసం.. ఈ హ్యాండ్‌సెట్‌లో ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 9,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉన్న ఈ వన్‌ప్లస్ టర్బో 6.. 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, 80W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

OnePlus Turbo 6తో పాటు OnePlus Turbo 6V గురించి కూడా కొన్ని ముఖ్యమైన వివరాలను పంచుకుంది. కొన్ని మినహాయింపులు తప్ప.. ఇది ప్రాథమిక టర్బో 6తో పోల్చదగిన ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. టెక్ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఫోన్‌లో 144 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.8-అంగుళాల 1.5K OLED స్క్రీన్ ఉండనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories