OnePlus Nord CE 5: వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదలకు సిద్ధం.. ఫీచర్లు అదరహో..!

OnePlus Nord CE 5: వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదలకు సిద్ధం.. ఫీచర్లు అదరహో..!
x
Highlights

OnePlus Nord CE 5: టెక్ మేకర్ వన్‌ప్లస్ భారతదేశంలో సరికొత్త ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

OnePlus Nord CE 5: టెక్ మేకర్ వన్‌ప్లస్ భారతదేశంలో సరికొత్త ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఇప్పటికే OnePlus 13s లాంచ్‌ను ధృవీకరించింది. ఇప్పుడు త్వరలో OnePlus Nord CE 5ని పరిచయం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టెక్ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ BIS సర్టిఫికేషన్‌లో రిజిస్టర్ అయింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఖచ్చితమైన వివరాలు వెల్లడికాలేదు. కానీ, లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలు లీక్ అయ్యాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

OnePlus Nord CE 5 Launch Timeline

వన్‌ప్లస్ త్వరలోదేశంలో Nord CE 5 ను విడుదల చేయవచ్చు, ఇది గత సంవత్సరం ఏప్రిల్‌లో విడుదలైన Nord CE 4 కి అప్‌డేట్ వెర్షన్. నార్డ్ CE 5 లాంచ్ అయేందుకు దగ్గర పడిందని సూచిస్తూ ఇటీవల అనేక లీక్‌లు, రెండర్‌లు వెలువడ్డాయి.

OnePlus Nord CE 5 Specifications

వన్‌ప్లస్ నార్డ్ CE 5 మొబైల్ 6.7-అంగుళాల ఫుల్‌హెచ్‌డి ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో రావచ్చు. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో ఎక్కువ సామర్థ్యం గల 7,100mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రన్ కావచ్చు. కెమెరా గురించి చెప్పాలంటే వన్‌ప్లస్ నార్డ్ CE 5‌లో 50 మెగాపిక్సెల్ సోని LYT600/IMX882 ప్రైమరీ షూటర్, 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. అలాగే, ముందు భాగంలో 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను చూడవచ్చు.

OnePlus Nord CE 5 Design

లీకైన డిజైన్ రెండర్ ప్రకారం, ఇది రిఫ్రెష్ చేసిన డిజైన్‌తో రావచ్చు. దీని ముందు మోడల్ Nord CE 4, వెనుక ప్యానెల్ లెఫ్ట్ కార్నర్‌లో కెమెరా మాడ్యూల్‌ ఉంటుంది. ఇది చిన్న సర్కిల్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో ఉంటుంది. అలానే సెంటర్ పంచ్-హోల్ కటౌట్ డిజైన్, స్లిమ్ బెజెల్స్ ఉండవచ్చు.

OnePlus Nord CE 5 Price

నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ CE 5 ధర రూ.24,999 ఉండే అవకాశం ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియలేదు. లైట్ పింక్ కలర్‌లో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories