COVID-19 Vaccination: MyGov హెల్ప్ డెస్క్‌తో కోవిడ్-19 వ్యాక్సిన్ కేంద్రాల వివరాలు: ఎలా ఉపయోగించాలో తెలుసా?

MyGov Corona Helpdesk Helps Nearby COVID-19 Vaccination Centres: How to Use It
x

వాట్సాప్ హెల్ప్ డెస్క్ 

Highlights

COVID-19 Vaccination: ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ మూడో దశలో ఉంది.

COVID-19 Vaccination: ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ మూడో దశలో ఉంది. 18 ఏళ్లు నిండిని వారికి కూడా వ్యాక్సిన్ అందించనున్నారు. వ్యాక్సిన్ చేపించుకునేందుకు స్లాట్ బుకింగ్ ల కోసం ప్రభుత్వం కోవిన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పోర్టల్ ద్వారా మీ సమీప ప్రాంతాల్లోని వ్యాక్సిన్ కేంద్రాల జాబితాను కూడా పొందవచ్చు. ఈ మేరకు కేంద్రం My Gov కరోనా హెల్స్ డెస్క్ చాట్ బాట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మీ ప్రాంతాల్లోని టీకా కేంద్రాలను చాలా ఈజీగా శోధించవచ్చు.

నకిలీ వార్తలను నిర్మూలించేందుకు, COVID-19 పై అవగాహన పెంచడానికి ఈ చాట్‌బాట్ ను గత సంవత్సరం కేంద్రం ప్రారంభించింది. ఇది ప్రారంభించిన 10 రోజుల్లోనే 1.7 కోట్ల వినియోగదారుల మైలురాయిని దాటింది. మూడవ దశ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో.. మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ ఇప్పుడు ప్రజలకు సమీప టీకా కేంద్రాన్ని కనుగొనడంలో సహాయపడుతుందని మైగోవిండియా ట్వీట్ చేసింది.

సమీప టీకా కేంద్రాన్ని ఎలా కనుగొనాలి?

మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ వాట్సాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్ రోల్‌ అవుట్ ప్రయోజనాన్ని పొందాలంటే.. మీరు వాట్సప్ కలిగి ఉండాలి. సమీప టీకా కేంద్రాన్ని ఎలా కనుగొనాలో ఇప్పుడు చూద్దాం..

  • 9013151515 నంబర్‌ను మీ వాట్సప్ లో సేవ్ చేయండి. MyGoV కరోనా హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ తెరవడానికి ఈ లింక్‌ను సందర్శించండి.
  • సంభాషణను ప్రారంభించడానికి చాట్‌లో హాయ్ లేదా నమస్తే అని టైప్ చేయండి
  • అప్పుడు చాట్ బాట్ మిమ్మల్ని వరుస ప్రశ్నలను అడుగుతుంది. చివరికి మీరు నివసించే పిన్ కోడ్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది.
  • MyGoV కరోనా హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ టీకా కేంద్రాల జాబితాను మీరు ఇచ్చిన పిన్ కోడ్ ఆధారంగా పంపుతుంది.
  • వాట్సాప్ కాకుండా, మీరు మాప్‌మీఇండియా ప్లాట్‌ఫామ్ ద్వారా లేదా కోవిన్ ప్లాట్‌ఫామ్ ద్వారా సమీపంలోని టీకా కేంద్రాలను చూడవచ్చు. కోవిన్ వెబ్‌సైట్ లోని హోమ్‌పేజీలో 'సమీప టీకా కేంద్రాలను కనుగొనేందుకు ఓ ఆప్షన్ ఇచ్చారు. అక్కడ మీ పిన్ ‌కోడ్ నంబర్ ఇచ్చి కేంద్రాల లిస్టును పొందవచ్చు.
Show Full Article
Print Article
Next Story
More Stories