Moto G96 5G Offer: బడ్జెట్ ధరలో కర్వ్డ్ డిస్‌ప్లే కింగ్.. మోటో G96 5Gపై భారీ ఆఫర్స్.. మిస్ అవ్వకండి..!

Moto G96 5G Offer
x

Moto G96 5G Offer: బడ్జెట్ ధరలో కర్వ్డ్ డిస్‌ప్లే కింగ్.. మోటో G96 5Gపై భారీ ఆఫర్స్.. మిస్ అవ్వకండి..!

Highlights

Moto G96 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మోటోరోలా తనదైన ముద్ర వేస్తోంది. గతేడాది లాంచ్ అయిన మోటో G96 5G ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Moto G96 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మోటోరోలా తనదైన ముద్ర వేస్తోంది. గతేడాది లాంచ్ అయిన మోటో G96 5G ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ అయినప్పటి నుండి తన ప్రీమియం ఫీచర్లతో యూజర్లను కట్టిపడేస్తోంది. ముఖ్యంగా స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ కోరుకునే యువతకు ఇది ఫేవరెట్ ఆప్షన్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్న భారీ డిస్కౌంట్ చూస్తుంటే, కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. రూ. 20,999 ఉన్న ఈ ఫోన్ ధర ఇప్పుడు భారీగా తగ్గడం విశేషం.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటో G96 5G (8GB + 128GB) వేరియంట్‌పై ఏకంగా 14 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీనివల్ల ఫోన్ ధర కేవలం రూ. 17,999 కి చేరుకుంది. అంటే మీరు నేరుగా రూ. 3,000 ఆదా చేయవచ్చు. అంతటితో ఆగకుండా బ్యాంక్ ఆఫర్లు కూడా తోడయ్యాయి. ఆక్సిస్ బ్యాంక్ లేదా SBI క్రెడిట్ కార్డులు ఉన్నవారు అదనంగా మరో రూ. 900 వరకు తగ్గింపు పొందవచ్చు. అన్ని ఆఫర్లు కలిపితే దాదాపు రూ. 4,000 తక్కువకే ఈ స్మార్ట్‌ఫోన్ మీ సొంతం అవుతుంది. ఈ ధరలో ఇన్ని ఫీచర్లు ఉన్న ఫోన్ దొరకడం గ్రేట్ డీల్ అనే చెప్పాలి.

ఈ ఫోన్ హైలైట్ ఏదైనా ఉందంటే అది దీని కర్వ్డ్ pOLED డిస్‌ప్లే మాత్రమే. 6.67 ఇంచుల పెద్ద స్క్రీన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. దీని 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో UI తో రావడం వల్ల ఫోన్ వాడకం చాలా స్మూత్‌గా, ఎలాంటి లాగ్స్ లేకుండా ఉంటుంది.

హెవీగా ఫోన్ వాడే వారి కోసం ఇందులో 5500mAh భారీ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా నిరంతరాయంగా వాడుకోవచ్చు. 33W టర్బో పవర్ ఛార్జింగ్‌తో ఫోన్ చాలా వేగంగా రీఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ కేవలం ఫీచర్లకే పరిమితం కాకుండా మన్నికలోనూ మొనగాడు అనిపించుకుంటోంది. IP68 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీటి నుండి ఫోన్‌కు రక్షణ లభిస్తుంది. పొరపాటున ఫోన్ నీటిలో పడినా లేదా వానలో తడిసినా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం మోటో ఇందులో 50MP మెయిన్ కెమెరాను OIS సపోర్ట్‌తో ఇచ్చింది. దీనివల్ల ఫోటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా స్టేబుల్‌గా వస్తాయి. 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ల్యాండ్‌స్కేప్ షాట్స్ కోసం బాగుంటుంది. ఇక సెల్ఫీ ప్రియుల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. 5G కనెక్టివిటీతో పాటు బ్లూటూత్ 5.2, NFC, టైప్-సి పోర్ట్ వంటి అన్ని మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఆల్ రౌండర్ ఫోన్ కావాలనుకునే వారికి మోటో G96 5G ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

Show Full Article
Print Article
Next Story
More Stories