Motorola Edge 60 Fusion 5G: మార్కెట్‌ను షేక్ చేయనున్న మోటో.. త్వరలో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్..!

Motorola Launch Edge 60 Fusion Check Features and all Details
x

Motorola Edge 60 Fusion 5G: మార్కెట్‌ను షేక్ చేయనున్న మోటో.. త్వరలో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్..!

Highlights

Motorola Edge 60 Fusion 5G: ఈ ఏడాది ఇప్పటికే చాలా స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే మోటరోలా గత ఏడాది కాలంలో అనేక అద్భుతమైన ఫోన్‌లను విడుదల చేసింది.

Motorola Edge 60 Fusion 5G: ఈ ఏడాది ఇప్పటికే చాలా స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే మోటరోలా గత ఏడాది కాలంలో అనేక అద్భుతమైన ఫోన్‌లను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ భారతీయ మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను 'Motorola Edge 60 Fusion 5G'. విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి లీకులు కూడా రావడం మొదలయ్యాయి. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ స్వయంగా టీజ్ చేసింది. మోటరోలా తన మైక్రోసైట్‌ను ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్‌లోకి ప్రవేశించబోతోందని తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Motorola Edge 60 Fusion 5G Leaks

కంపెనీ ఇప్పుడే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో జాబితా చేసింది. కానీ, దీని ఫీచర్లు లేదా లాంచ్ తేదీ ఏ విధంగానూ వెల్లడించలేదు. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ అనేది మార్కెట్లో ఉన్న మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అప్‌గ్రేడ్ వెర్షన్. తాజాగా ఓ టెక్ వీరుడు ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోలు లీక్ చేశాడు. లీకైన ఫోటో నుండి, ఈ స్మార్ట్‌ఫోన్ గ్రే, పింక్, బ్లూ కలర్ ఆప్షన్‌లతో భారత్‌లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఇందులో 50మెగాపిక్సెల్ Sony LYTIA సెన్సార్, 24మిమీ లెన్స్, 12మిమీ అల్ట్రా-వైడ్ సెన్సార్ అందించవచ్చు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం దాని ముందు భాగంలో 32మెగాపిక్సెల్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, దాని లాంచ్‌కు సంబంధించి కంపెనీ నుండి ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు, అయితే లీక్‌లు నిజమైతే మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రావచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories