Moto G45 5G Deal: మాయ చేస్తున్న మోటో.. రూ.9,999కే 5జీ ఫోన్.. 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సేల్ షురూ..!

Moto g45 5G
x

Moto g45 5G

Highlights

Moto G45 5G Deal: మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ Moto g45 5Gని ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కి తీసుకొచ్చింది. రూ. 9,999కి ఆఫర్లపై కొనుగోలు చేయవచ్చు.

Moto G45 5G Deal: స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటో టాప్ గేరులో దూసుకుపోతుంది. వరుసగా బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లను లాంచ్ చేస్తు టాప్ కంపెనీలకు చెమటలు పట్టిస్తుంది. ఈ క్రమంలోనే తన బ్రాండ్ నుంచి మరో కొత్త గ్యాడ్జెట్ Moto g45 5G‌ని తక్కువ ధరకే సేల్‌కు తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 21న విడుదల చేసింది. ఫోన్ Qualcomm Snapdragon 6s Gen 3 చిప్‌తో వస్తుంది. ఇది అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. ఈ క్రమంలో ధర, ఆఫర్‌లు, స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం.

Moto G45 5G Offer
మోటరోలా Moto g45 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. అందులో 4GB + 128GB మోడల్ ధర రూ.10,999. కాగా, 8GB + 128GB వేరియంట్ ధర రూ.12,999. ఆఫర్‌ల విషయానికొస్తే కంపెనీ యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ కస్టమర్‌లకు క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (ఇఎంఐ) లావాదేవీలపై రూ. 1,000 తగ్గింపును అందిస్తోంది.

అంటే బ్యాంక్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ ఫోన్‌ను కేవలం రూ.9,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా అఫిషియల్ వెబ్‌సైట్, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ Flipkart ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫోన్ మూడు అద్భుతమైన కలర్స్ ఆప్షన్స్‌లో వస్తుంది. దీనిలో బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్, వివా మెజెంటా రంగులు ఉన్నాయి.

Moto G45 5G Specifications

స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 4GB/8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ముందు భాగంలో ఫోన్ 6.5 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ కలిగి ఉంది. Motorola నుండి ఈ చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అదే సమయంలో ఇది సెల్ఫీ, వీడియో క్యాప్చర్ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ఉత్తమ ఆడియో అనుభవం కోసం డాల్బీ అట్మోస్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. Moto g45 5G 5000mAh బ్యాటరీని పొందుతుంది. Android 14-ఆధారిత HelloUI ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories