Motorola New Smartphones: మోటోరోలా నుంచి స్టన్నింగ్‌ ఫోన్స్.. ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..!

Motorola g 2026 and Motorola g power 2026 launch soon renders revealed features specifications
x

Motorola New Smartphones: మోటోరోలా నుంచి స్టన్నింగ్‌ ఫోన్స్.. ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..!

Highlights

Motorola New Smartphones: మోటరోలా తన కొత్త G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను - Moto G 2025 , Moto G Power 2025 లను కొన్ని నెలల క్రితం విడుదల చేసింది.

Motorola New Smartphones: మోటరోలా తన కొత్త G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను - Moto G 2025 , Moto G Power 2025 లను కొన్ని నెలల క్రితం విడుదల చేసింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ రాబోయే ఫోన్‌ల మోడళ్లు - మోటరోలా G 2026 , మోటరోలా G పవర్ 2026. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ ఈ ఫోన్ల రెండర్‌లను షేర్ చేసింది. రెండర్ల ప్రకారం, ఈ ఫోన్‌ల డిజైన్ మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉంటుంది.

Motorola G 2026, Motorola G Power 2026 Features

లీక్ ప్రకారం.. ఈ ఫోన్లలో కంపెనీ 6.7, 6.8 అంగుళాల డిస్‌ప్లే అందించవచ్చు. ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు మూడు కెమెరాలను ఇవ్వచ్చు. వీటిలో 50-మెగాపిక్సెల్ OIS మెయిన్ సెన్సార్‌తో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉండచ్చు. మోటో G 2026 మోడల్ నంబర్ (XT2613-1) కాగా, ఇది వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో రావచ్చు. Moto G పవర్ 2026 మోడల్ నంబర్ (XT2615-1). ఫోన్ వెనుక ప్యానెల్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు.

Motorola G 2026, Motorola G Power 2026 Processor And Battery

ఫోన్ పవర్ మోడల్ కొంచెం బరువుగా అనిపిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అందించగలదని అంచనా. లీక్స్ ప్రకారం.. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 పై రన్ అవుతాయి. ప్రాసెసర్‌గా, కంపెనీ దానిలో డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను అందించగలదు. ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ గురించి ఖచ్చితంగా ఏమీ చెప్పలేము. అయితే, ఈ రెండు ఫోన్‌లు జనవరి 2026లో CES తర్వాత మార్కెట్లోకి రావచ్చని చెబుతున్నారు.

Motorola Edge 70

ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ మోటో ఎడ్జ్ 70 ఫోటోను కూడా షేర్ చేసింది. నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ 6.7-అంగుళాల pOLED డ్యూయల్ కర్వ్డ్ డిస్‌ప్లేతో రావచ్చు. ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను చూడచ్చు. దీని డిజైన్ చాలావరకు ఎడ్జ్ 60 సిరీస్‌ని పోలి ఉంటుంది. డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను ఫోన్‌లో ప్రాసెసర్‌గా ఇవ్వచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories