Motorola Edge 60 Pro: ఆల్ రౌండర్ మొబైల్.. మోటరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్.. మతిపోగొడుతున్న ఫీచర్స్..!

Motorola Edge 60 Pro: ఆల్ రౌండర్ మొబైల్.. మోటరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్.. మతిపోగొడుతున్న ఫీచర్స్..!
x

Motorola Edge 60 Pro: ఆల్ రౌండర్ మొబైల్.. మోటరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్.. మతిపోగొడుతున్న ఫీచర్స్..!

Highlights

Motorola Edge 60 Pro: ఆల్ రౌండర్ మొబైల్.. మోటరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్.. మతిపోగొడుతున్న ఫీచర్స్..!

Motorola Edge 60 Pro Launch Date And Price

మోటరోలా ఎడ్జ్ 60 ప్రో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ కానుంది. ఫోన్ లాంచ్ అయిన తర్వాత, ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అఫిషియల్ వెబ్‌సైట్, అనేక రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ధర విషయానికి వస్తే భారతదేశంలో మోటరోలా ఎడ్జ్ 60 ప్రో ధర రూ. 35 వేల కంటే తక్కువగా ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి.

Motorola Edge 60 Pro Features

ఫీచర్ల గురించి చెప్పాలంటే, మోటరోలా ఎడ్జ్ 60 ప్రో 6.67-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ p-OLED డిస్‌ప్లే‌తో వస్తుంది. ఇది 4,500 నిట్‌ల పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇందులో 12GB ర్యామ్, 256GB వరకు UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

Motorola Edge 60 Pro Camera Features

ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో OISతో 50MP Sony-LYT 700C ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్, 50MP సెల్ఫీ కెమెరా లభిస్తాయి. ఇది మాత్రమే కాదు, ఫోన్‌లో 6,000mAh పెద్ద బ్యాటరీని కూడా చూడచ్చు, ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 60 ప్రో యొక్క ఇతర ఫీచర్లు

Motorola Edge 60 Pro Software

సాఫ్ట్‌వేర్ పరంగా.. ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 OSలో రన్ కావచ్చు. 3 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను కంపెనీ అందిస్తుంది. ఇతర స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుకుంటే, మొబైల్‌లో AI ఫీచర్లు, MIL-STD-810H సర్టిఫికేషన్,వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 ,IP69 రేటింగ్‌లను పొందే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories