Moto Edge 60 Fusion 5G First Sale: కొత్త మోటోరోలా 5G ఫోన్.. ఈరోజే ఫస్ట్‌సేల్.. ఆఫర్లు పిచ్చెక్కించేలా ఉన్నాయి..!

Moto Edge 60 Fusion 5G First Sale Starts at 12noon Today on Flipkart With Huge Discounts
x

Moto Edge 60 Fusion 5G First Sale: కొత్త మోటోరోలా 5G ఫోన్.. ఈరోజే ఫస్ట్‌సేల్.. ఆఫర్లు పిచ్చెక్కించేలా ఉన్నాయి..!

Highlights

Moto Edge 60 Fusion 5G First Sale: మోటరోలా అద్భుతమైన బడ్జెట్ "Moto Edge 60 Fusion 5G" స్మార్ట్‌ఫోన్ ఈరోజు భారతదేశంలో మొదటిసారిగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానుంది.

Moto Edge 60 Fusion 5G First Sale: మోటరోలా అద్భుతమైన బడ్జెట్ "Moto Edge 60 Fusion 5G" స్మార్ట్‌ఫోన్ ఈరోజు భారతదేశంలో మొదటిసారిగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32MP సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీతో సహా అనేక ప్రత్యేక ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నాయి. మొదటి సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు బ్యాంక్ ఆఫర్ కింద రూ.2,500 వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. కాబట్టి.. ఈ కొత్త మోటరోలా 5జీ స్మార్ట్‌ఫోన్ ధర, దానిలోని కొన్ని ఫీచర్లను క్రింద తెలుసుకుందాం.

Moto Edge 60 Fusion 5G Price

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. మరొక 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 .

Moto Edge 60 Fusion 5G First Sale And Offers

ఫస్ట్ సేల్‌లో ఆసక్తిగల వినియోగదారులు ఐడిఎప్‌సి, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈఎమ్ఐ ద్వారా రూ. 2500 అదనపు తగ్గింపును కూడా పొందచ్చు. కాబట్టి మొత్తం మీద కస్టమర్లు ఈ సరికొత్త మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌తో కేవలం రూ.20,499 ప్రారంభ ధరకు కొనుగోలు చేయచ్చు. స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ఈరోజు, ఏప్రిల్ 9, 2025న మధ్యాహ్నం 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ఇండియా,మోటరోలా వెబ్‌సైట్ , ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది.

Moto Edge 60 Fusion 5G Specifications

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల pOLED (2712×1220 పిక్సెల్స్) క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 5500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫోటోలు, వీడియోల కోసం ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇది f/1.8 ఎపర్చరుతో 50MP మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో 13MP అల్ట్రా వైడ్ , మాక్రో లెన్స్‌ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32MP మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్‌ బిల్డ్ అందించారు.

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ మెమరీని 1024GB వరకు పెంచుకొనే అవకాశాన్ని ఇస్తుంది. దీని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్, జీపీఎస్, వైఫై, 3.5మిమీ ఆడియో జాక్, యూఎస్‌బి టైప్ సి ఛార్జ్ పోర్ట్, ఏజీపీఎస్/జీపిఎస్, గ్లోనాస్, బిడిఎస్, గెలీలియో సెన్సార్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories