Electric Scooter: 50 ఏళ్ల స్కూటర్‌ రూపురేఖలు మార్చిన కుర్రాడు.. 2.5 గంటల ఛార్జ్‌లో 50 కిమీల మైలేజీ.. వావ్ అనాల్సిందే..!

Mit Manipur Student Transforms 50 years old Bajaj Scooter into Electric
x

Electric Scooter: 50 ఏళ్ల స్కూటర్‌ రూపురేఖలు మార్చిన కుర్రాడు.. 2.5 గంటల ఛార్జ్‌లో 50 కిమీల మైలేజీ.. వావ్ అనాల్సిందే..!

Highlights

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి 50 ఏళ్లు పైబడిన పాతకాలపు వాహనాన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ (ఈ-స్కూటర్)గా మార్చాడు. దీనిపై నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Electric Scooter: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి 50 ఏళ్లు పైబడిన పాతకాలపు వాహనాన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ (ఈ-స్కూటర్)గా మార్చాడు. దీనిపై నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆల్బర్ట్ సారంగ్థెమ్ అనే యువ ఇంజనీరింగ్ విద్యార్థి మూడేళ్ల క్రితం ఇదే పద్ధతిలో మోటార్ సైకిల్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. విద్యార్థి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 'సమడాన్ EV-II' అని పేరు పెట్టారు. అంటే, పురాణాలలో కనిపించే రెక్కలుగల ఎగిరే గుర్రంలాంటిది అన్నమాట.

ఈ పాతకాలపు స్కూటర్ తన తాతగారి 50 ఏళ్ల బజాజ్ 150 స్కూటర్ అని, ఇది బంధువుల ఇంట్లో తుప్పు పట్టి పడి ఉందని ఇంజనీరింగ్ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇక్కడి నుంచి స్కూటర్‌ని పునరుద్ధరించే ఆలోచన వచ్చింది. ఈ స్కూటర్‌లోని పాడైన ఇంజన్‌ని తొలగించి అందులో ఎలక్ట్రిక్ మోటార్, లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ స్కూటర్‌ను దాదాపు రెండున్నర గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.

పెట్రోల్‌తో నడిచే ఈ స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు, ఆల్బర్ట్ ఇంజిన్, కార్బ్యురేటర్, సంబంధిత భాగాలను తొలగించాడు. వాటి స్థానంలో మోటార్, స్పీడ్ కంట్రోలర్, బ్యాటరీ, ఇతర అవసరమైన భాగాలు అమర్చాడు. అయితే ఇందులో ఆల్బర్ట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. స్కూటర్‌ను సిద్ధం చేస్తున్నప్పుడు, చాలా ముఖ్యమైన భాగాలు మార్కెట్లో దొరకలేదు. వాటిని కనుగొనడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ కారణంగా, స్కూటర్ మేక్ఓవర్ ప్రక్రియను ఎనిమిది నెలలు పొడిగించవలసి వచ్చింది.

స్కూటర్ తయారీలో ఇంటర్నెట్ సహాయం..

స్కూటర్ తయారీలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఆల్బర్ట్ తన పనిని కొనసాగించి స్కూటర్‌ను మెరుగుపరచడానికి ఇంటర్నెట్ సహాయం తీసుకున్నాడు. అనేక రిపేర్ షాపులను సందర్శించి స్కూటర్ల తయారీకి సంబంధించిన సాంకేతిక వివరాలను కూడా తెలుసుకున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆల్బర్ట్ సారంగ్థెమ్ నైపుణ్యాన్ని చూసి, మణిపూర్ రవాణా మంత్రి ఖాషిమ్ వాషుమ్ అతనికి ఆర్థికంగా బహుమతిని అందించారు. 2022లో, ఆల్బర్ట్‌కు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ప్రశంసా పత్రం అందించారు.

రూపాంతరం చెందిన వాహనాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

ఇంధనంతో నడిచే వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి స్థానిక RTO నుంచి 'అప్రూవల్' అవసరం. ఇటువంటి వాహనాన్ని అనుమతి లేకుండా నడపడం చట్టవిరుద్ధం. అలా చేసినందుకు మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఆమోదం పొందిన తర్వాత, వాహనానికి కొత్త నంబర్ ప్లేట్ (ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ నంబర్ ప్లేట్) జారీ చేయబడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories