Mist Sun Umbrella: మండే ఎండల్లో చల్లచల్లగా తిరగొచ్చు.. మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త గొడుగు.. ఫీచర్లు, ధర చూస్తే పరేషానే..!

Mist Sun Umbrella for Summer Gives Cool Air Like AC Check Price and Features
x

Mist Sun Umbrella: మండే ఎండల్లో చల్లచల్లగా తిరగొచ్చు.. మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త గొడుగు.. ఫీచర్లు, ధర చూస్తే పరేషానే..!

Highlights

Mist Sun Umbrella: దేశంలోని అనేక నగరాల్లో చాలా వేడిగా ఉంది.

Mist Sun Umbrella: దేశంలోని అనేక నగరాల్లో చాలా వేడిగా ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నా, ఆఫీసుకు వెళ్లినా.. చాలా మంది గొడుగు పట్టుకుని ఇంటి నుంచి వెళ్తున్నారు. విపరీతమైన వేడితో ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఈ ఎండ నుంచి కాపాడుకోవడానికి మార్కెట్‌లోకి కొత్తగా ఓ గొడుగు వచ్చింది. దీనిని మిస్ట్ అంబరిల్లా( పొగమంచు గొడుగు) అని పిలుస్తున్నారు. ఇది ఎంత వేడి ఉన్నా మనకు చల్లని నీడను అందిస్తుంది. అలాగే, ఇందులో మరెన్నో ఫీచర్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణ గొడుగులతో పోలిస్తే, ఇది చాలా మంచి ఫీచర్లతో వస్తుంది. అందుకే ఇది ప్రత్యేక గొడుగుగా పేరుగాంచింది.

ధర ఎంత?

MISTERBREEZE సన్ అంబ్రెల్లాను అమెజాన్ నుంచి రూ. 11,573కి కొనుగోలు చేయవచ్చు. ఇది UVA, UVB కిరణాల నుంచి రక్షణను అందిస్తుంది.

ఈ స్మార్ట్ గొడుగు లోపల 3.25 అంగుళాల ఫ్యాన్ ఇన్‌స్టాల్ చేశారు. దానికి శక్తినివ్వడానికి ఈ గొడుగులో బ్యాటరీ కూడా ఏర్పాటు చేశారు. బటన్ సహాయంతో పనిచేసే ఈ గొడుగులో ఫ్యాన్ కూడా అమర్చబడి ఉంటుంది. దీన్ని ఛార్జ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ గొడుగుతో వాటర్ బాటిల్‌ను కూడా అమర్చవచ్చు. దాని సహాయంతో నీరు స్ప్రే చేయబడుతుంది. ఈ సందర్భంలో, మీరు చల్లని గాలిని పొందుతారు.

అమెజాన్ ఇండియాలో జాబితా చేయబడిన వివరాల ప్రకారం, ఇది డ్యూయల్ లేయర్ UV రక్షణను కలిగి ఉంది. ఇందులో పోంగీ ఫ్యాబ్రిక్ ఉపయోగించారు. దీంతో ఇది 99.99 శాతం ప్రమాదకరమైన UVA మరియు UVBలను అడ్డుకుంటుంది.

ఈ ఎలక్ట్రిక్ గొడుగు అనేక రంగు ఎంపికలలో వస్తుంది. ఇది కూల్ స్టాండర్డ్ కింద మూడు రంగులలో వస్తుంది. నీలం, పసుపు, బూడిద రంగుల్లో లభిస్తుంది. ఇది కాకుండా, కొన్ని రంగుల ఎంపికలు కూడా ఉన్నాయి. మీరు దీన్ని ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ప్రయాణాల్లో, బస్టాండ్‌లో లేదా ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు ఉపయోగించవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories