Mi 11 Lite: అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ 11 లైట్

Mi 11 Lite Specifications Leaked
x

ఎంఐ 11 లైట్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Mi 11 Lite: ఎంఐ నుంచి త్వరలో రిలీజ్ కానున్న ఎంఐ11 లైట్ స్మార్ట్ ఫోన్ ఆన్ లైన్ లో లీకైంది.

Mi 11 Lite: ఎంఐ నుంచి త్వరలో రిలీజ్ కానున్న ఎంఐ11 లైట్ స్మార్ట్ ఫోన్ ఆన్ లైన్ లో లీకైంది. ధర, ఫొటోలు, ఫీచర్లు ఇవేనంటూ షేరవుతున్నాయి. ఈ ఫోన్ మార్చి 29న లాంచ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేరోజు ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో ఫోన్లు కూడా గ్లోబల్ మార్కెట్లో విడుదల అవుతున్నాయి. ఇందులో బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉండనున్నాయి.

ఎంఐ 11 లైట్ 4G వేరియంట్‌లో 64 GB మోడల్ ధర 279 యూరోలుగా(సుమారు రూ.24,000) ఉండబోతోందని జర్మన్ పబ్లికేషన్ విన్‌ఫ్యూచర్ వెల్లడించింది. అలాగే 128 GB మోడల్ ధర 329 యూరోలుగా(సుమారు రూ.28,300) ఉందని తెలిపింది. ఇందులో 5G మోడల్ కూడా రానున్నట్లు సమాచారం. 5Gలో రెండు ర్యామ్ వేరియంట్స్ ఉండనున్నాయి. వీటి ధర 399 యూరోలుగానూ(సుమారు రూ.34,300), 429 యూరోలుగానూ(సుమారు రూ.36,900) నిర్షయించినట్లు తెలుస్తోంది. ఎంఐ 11 లైట్ 4G బోబా బ్లాక్, బబుల్ గమ్ బ్లూ, పీచ్ పింక్ కలర్స్‌లో, 5G మోడల్ ట్రఫుల్ బ్లాక్, సిట్రస్ ఎల్లో, మింట్ గ్రీన్ కలర్స్ లో లాంచ్ కానుంది.

కాగా, బ్యాక్ సైడ్ లో మూడు ప్రైమరీ కెమెరాల సెటప్ తో రానున్నాయని తెలుస్తోంది. వీటిలో మెయిన్ కెమెరా సామర్థ్యం 64 MP ఉండనుంది. దీంతోపాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 MP మాక్రో షూటర్ ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 MP కెమెరాను అందించనున్నారు. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు తో చార్జింగ్ చేసుకోవచ్చు. కానీ, ఈ ఫొటోలలో హెడ్ ఫోన్ జాక్ మాత్రం లేదు. 3 రంగుల్లో రానున్నాయి.

ఎంఐ 11 లైట్ 4G మోడల్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732G ప్రాసెసర్‌ను, 5G మోడల్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765G ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ ( ఆండ్రాయిడ్ 11 ఆధారిత) సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4250 mAh గా ఉండనుంది. ఇందులో మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా అందించనున్నారు. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories