Meta Job Cuts 2026: 1500 మంది ఉద్యోగులపై వేటు.. ఆ విభాగం క్లోజ్?

Meta Job Cuts 2026: 1500 మంది ఉద్యోగులపై వేటు.. ఆ విభాగం క్లోజ్?
x
Highlights

మెటా సంస్థ తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో 1500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మెటావర్స్ నుంచి ఏఐ (AI) వైపు దృష్టి మళ్లించడమే ఈ లేఆఫ్స్‌కు కారణం.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ 'మెటా' (Meta) సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది. తన రియాలిటీ ల్యాబ్స్ (Reality Labs) విభాగంలో పనిచేస్తున్న సుమారు 1500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మెటావర్స్ కలలతో భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ విభాగం, గత కొన్నేళ్లుగా నష్టాల్లో ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఏఐ వైపు మార్క్ జుకర్‌బర్గ్ చూపు:

మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పుడు తన ఫోకస్‌ను 'మెటావర్స్' నుంచి 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) వైపు మళ్లించారు. రియాలిటీ ల్యాబ్స్ విభాగంలోని మొత్తం 15,000 మంది ఉద్యోగుల్లో 10 శాతం మందిని అంటే 1500 మందిని ఇంటికి పంపాలని నిర్ణయించారు. ఈ కోతలు ముఖ్యంగా వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ప్రాజెక్టులపై పనిచేసే వారిపై పడనున్నాయి.

జనవరి 14న కీలక సమావేశం:

ఈ తొలగింపుల నేపథ్యంలో మెటా సీటీఓ (CTO) ఆండ్రూ బోస్‌వర్త్ జనవరి 14న ఉద్యోగులందరితో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఈ విభాగం ఉద్యోగులను, ఈసారి స్వయంగా ఆఫీసుకు రావాలని ఆదేశించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో మిగిలిన ఉద్యోగుల భవిష్యత్తు మరియు ఏఐ దిశగా కంపెనీ తీసుకోబోయే తదుపరి చర్యల గురించి చర్చించనున్నారు.

భారీ నష్టాలే కారణమా?

రే-బ్యాన్ స్మార్ట్ గ్లాసెస్, క్వెస్ట్ హెడ్‌సెట్స్ వంటి ఉత్పత్తులు ఉన్నప్పటికీ, రియాలిటీ ల్యాబ్స్ విభాగం బిలియన్ల డాలర్ల మేర నష్టాలను చవిచూసింది. అందుకే, వేగంగా రాబడి వచ్చే అవకాశం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల విస్తరణపై మెటా ఇప్పుడు భారీగా పెట్టుబడులు పెడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories