2025 Mahindra Bolero Neo: మహీంద్రా బొలెరో నియో.. సరికొత్తగా వచ్చేసింది..!

2025 Mahindra Bolero Neo: మహీంద్రా బొలెరో నియో.. సరికొత్తగా వచ్చేసింది..!
x

2025 Mahindra Bolero Neo: మహీంద్రా బొలెరో నియో.. సరికొత్తగా వచ్చేసింది..!

Highlights

దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా తన ఫేమస్ ఎస్‌యూవీ బొలెరో నియో 2025 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది.

2025 Mahindra Bolero Neo: దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా తన ఫేమస్ ఎస్‌యూవీ బొలెరో నియో 2025 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన, ఫీచర్లతో వస్తుంది. ఈ ఫేస్‌లిఫ్టెడ్ ఎస్‌యూవీ కస్టమర్లకు కాస్మెటిక్ మార్పులు, అనేక కొత్త ఫీచర్లు, వివిధ రకాల కలర్ ఆప్షన్లను అందిస్తుంది. కంపెనీ భారతీయ మార్కెట్లో దాని ఎక్స్-షోరూమ్ ధరను సుమారు రూ.8.49 లక్షలుగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త మహీంద్రా ఎస్‌యూవీ ఎస్‌యూవీ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, వేరియంట్ వారీగా ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.

బొలెరో నియో ఎక్స్‌టీరియర్ ఇప్పుడు మరింత ఆధునికంగా కనిపిస్తుంది. కొత్త బాడీ-కలర్ గ్రిల్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్‌తో డ్యూయల్-టోన్ ఓఆర్వీఎమ్‌లు, డీఆర్ఎల్‌లతో ఇంటిగ్రేటెడ్ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. 15-16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కూడా అందిస్తుంది. కంపెనీ మొత్తం తొమ్మిది కలర్ ఆప్షన్లను అందించింది: డైమండ్ వైట్, స్టీల్త్ బ్లాక్, పెర్ల్ వైట్, రాకీ బీజ్, జీన్స్ బ్లూ (కొత్తది), కాంక్రీట్ గ్రే (కొత్తది), పెర్ల్ వైట్ డ్యూయల్-టోన్ (కొత్తది), జీన్స్ బ్లూ డ్యూయల్-టోన్ (కొత్తది), కాంక్రీట్ గ్రే డ్యూయల్-టోన్ (కొత్తది). ఈ కారు ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది: N4, N8, N10, N10 (O), N11.

ఇంటీరియర్ కూడా అనేక అప్‌గ్రేడ్‌లను పొందింది. కొత్త బొలెరో నియోలో లెథెరెట్ అప్హోల్స్టరీ, వైర్డు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో 9-అంగుళాల క్లస్టర్, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, ముందు, రెండవ-వరుస ఆర్మ్‌రెస్ట్‌లు, 7-సీటర్ లేఅవుట్, ఫోల్డబుల్ రెండవ వరుస, వెనుక వైపర్ డీఫాగర్, ఐసోఫిక్స్ మౌంట్‌లు, వెనుక కెమెరా, యూఎస్‌బీ సి పోర్ట్ ఉన్నాయి. ఇంకా, కంపెనీ కొత్త రైడ్‌ఫ్లె టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టింది, ఇది రైడ్ నాణ్యతను మరింత మెరుగుపరుస్తుంది.

ఇంజిన్, మెకానికల్స్ మారవు. ఈ ఎస్‌యూవీలో ఇప్పటికీ అదే నమ్మకమైన mHawk100 డీజిల్ ఇంజిన్‌ ఉంది. ఈ ఇంజిన్ 100 బీహెచ్‌పీ పవర్, 260ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటుంది. ఇది RWD సెటప్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కారు బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. క్రూయిజ్ కంట్రోల్, మల్టీ-టెర్రైన్ టెక్నాలజీ (MTT) ఇప్పుడు కొత్తగా చేర్చారు, ఇది దీన్ని మరింత శక్తివంతం చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories