Lenovo Legion 2 Pro: బిగ్ బ్యాటరీతో లెనోవా లెజీయన్ 2 ప్రో

Lenovo Legion 2 Pro to have bigger battery: Report
x
లెనోవా లెజీయన్ 2 ప్రో (ఫొటో హన్స్ ఇండియా)
Highlights

Lenovo Legion 2 Pro: బిగ్ బ్యాటరీతో లెనోవా లెజీయన్ 2 ప్రో ను ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నట్లు లెనోవా వెల్లడించింది.

Lenovo Legion 2 Pro: బిగ్ బ్యాటరీతో లెనోవా లెజీయన్ 2 ప్రో ను ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నట్లు లెనోవా వెల్లడించింది. గేమింగ్ స్మార్ట్‌ఫోన్ గా రానున్న ఈ ఫోన్ లో 5,500 mAh బ్యాటరీతో అలరించనుంది. ఇంతకుమందు వచ్చిన లెజీయన్ ప్రో తో పోల్చితే 500 mAh ఎక్కువ. ఈ స్మార్ట్ ఫోన్ కూడా పాత మోడల్ స్పెషిఫికేషన్స్ తోనే రానుందా? లేక మరిన్ని నూతన ఫీచర్లతో రానుందా అనేది పూర్తిగా తెలియదు.

అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో ఇతర ఫీచర్ల ను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. కాగా కొన్ని టెక్ కంపెనీల అంచనా ప్రకారం లెజీయన్ 2 ప్రో బ్యాటరీ 90W ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. గేమింగ్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-టర్బో కూలింగ్ టెక్నాలజీ తో రానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్, 6.92 "144Hz ఫుల్‌హెచ్‌డీ + అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది.

లెజీయన్ 2 ప్రో ఆండ్రాయిడ్ 11 తో పనిచేస్తుంది. అలాగే 16 బీజీ ర్యామ్ తో రానుంది. అలాగే 512GB స్టోరేజీ ని కలిగి ఉంటుందని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories