Sim Card New Laws: కొత్త సిమ్‌కార్డు కొనేముందు ఈ రూల్స్‌ తెలుసుకోండి.. లేదంటే జైలుకెళ్లే ప్రమాదం..!

Know These Rules Before Buying A New SIM Card Otherwise There Is A Risk Of Going To Jail
x

Sim Card New Laws: కొత్త సిమ్‌కార్డు కొనేముందు ఈ రూల్స్‌ తెలుసుకోండి.. లేదంటే జైలుకెళ్లే ప్రమాదం..!

Highlights

Sim Card New Laws: ప్రస్తుతం కొత్త సిమ్‌కార్డ్ తీసుకోవాలంటే చాలా రూల్స్‌ పాటించాలి. గతంలో ఒకే ఐడీపై చాలా సిమ్‌కార్డులు తీసుకునే వెసులుబాటు ఉండేది.

Sim Card New Laws: ప్రస్తుతం కొత్త సిమ్‌కార్డ్ తీసుకోవాలంటే చాలా రూల్స్‌ పాటించాలి. గతంలో ఒకే ఐడీపై చాలా సిమ్‌కార్డులు తీసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు సిమ్‌కార్డ్‌ రూల్స్‌ మార్చేశారు. ఇప్పుడు సిమ్‌కార్డు కోసం చాలా ప్రాసెస్‌ ఉంటుంది. నకిలీ సిమ్‌కార్డుల వల్ల మోసాలు, నేరాలు జరుగుతున్నాయి. ఇలాంటి కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సిమ్ కార్డులకు సంబంధించి కఠిన చట్టాలను రూపొందించింది. డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం.

10 లక్షల జరిమానా

ఇందులో మొదటగా చెప్పుకునే విషయం సిమ్ డీలర్ వెరిఫికేషన్. అంటే ఎవరైనా సిమ్ కార్డ్ అమ్ముతున్నప్పుడు లేదా సిమ్ కార్డ్‌ల విక్రయించే వ్యాపారం చేస్తున్నట్లయితే అతను వెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది. సిమ్ విక్రయించేటప్పుడు కస్టమర్‌ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. అలాగే పోలీస్ వెరిఫికేషన్‌కు టెలికాం ఆపరేటర్లే బాధ్యత వహిస్తారు. దీన్ని పాటించకపోతే రూ.10 లక్షల జరిమానా విధిస్తారు.

ఒక IDపై 9 SIM కార్డ్‌లు మాత్రమే

ప్రస్తుతం సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లు తమ ఆధార్, డెమోగ్రాఫిక్ డేటాను సమర్పించాలి. సిమ్ కార్డ్ డీ-యాక్టివేషన్ నియమాలు అంటే సిమ్ కార్డ్‌లు మునుపటిలాగా పెద్దమొత్తంలో జారీ చేయరు. సిమ్ కార్డ్‌ని నిష్క్రియం చేసిన తర్వాత 90 రోజుల తర్వాత మాత్రమే ఆ నెంబర్‌ ఇతర వ్యక్తికి అందుబాటులో ఉంటుంది. అలాగే కొత్త నిబంధనల ప్రకారం సిమ్ కార్డుల సంఖ్యపై పరిమితిని నిర్ణయించారు. వ్యక్తులు కమర్షియల్‌ కనెక్షన్ల ద్వారా మాత్రమే పెద్దమొత్తంలో సిమ్ కార్డ్‌లను తీసుకునే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories