Laptop Heat Problem: ల్యాప్‌టాప్‌ పదే పదే వేడెక్కుతుందా.. భారీ నష్టం జరుగుతున్నట్లు లెక్క..!

Know if the Laptop Heats up Again and Again Heavy Damage is Done
x

Laptop Heat Problem: ల్యాప్‌టాప్‌ పదే పదే వేడెక్కుతుందా.. భారీ నష్టం జరుగుతున్నట్లు లెక్క..!

Highlights

Laptop Heat Problem: ఈ రోజుల్లో చాలామంది ల్యాప్‌టాప్‌ వాడుతున్నారు. గతంలో పట్టణాల్లో మాత్రమే వాడే ల్యాప్‌టాప్‌లు నేడు పల్టెటూర్లకు పాకాయి.

Laptop Heat Problem: ఈ రోజుల్లో చాలామంది ల్యాప్‌టాప్‌ వాడుతున్నారు. గతంలో పట్టణాల్లో మాత్రమే వాడే ల్యాప్‌టాప్‌లు నేడు పల్టెటూర్లకు పాకాయి. కరోనా పుణ్యమా అని ల్యాప్‌టాప్‌లకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. ఎందుకంటే ఆ సమయంలో చాలామంది వర్క్‌ ఫ్రం హోం చేశారు. దీంతో ల్యాప్‌టాప్‌ల అవసరం పెరిగింది. ఆఫీసు పనినుంచి పిల్లల హోంవర్క్ వరకు అన్ని పనులకు ల్యాప్‌టాప్‌ కావాల్సిందే. అయితే ల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే చాలా సమస్యలు ఎదురవుతాయి. ల్యాప్‌టాప్ ఎక్కువ సేపు రన్ అవ్వడం వల్ల హీట్‌ అయిపోతుంది. అంతేకాదు వేరే కారణాల వల్ల కూడా ల్యాప్‌టాప్‌ హీట్ అవుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే మీరు పెద్ద నష్టాన్ని చవిచూస్తారు.

ల్యాప్‌టాప్ లోపల పేరుకుపోయిన దుమ్ము, ధూళి గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీని వల్ల ల్యాప్‌టాప్ వేడెక్కుతుంది. ల్యాప్‌టాప్ ఫ్యాన్ చెడిపోతే అది ల్యాప్‌టాప్‌ను చల్లబరచదు. దీని కారణంగా ల్యాప్‌టాప్ వేడెక్కుతుంది. ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల అది వేడెక్కుతుంది. ల్యాప్‌టాప్‌ను వేడి ప్రదేశంలో ఉంచడం వల్ల అది వేడిగా మారుతుంది.

ల్యాప్‌టాప్ మళ్లీ మళ్లీ వేడెక్కుతుంటే దాని వేగం తగ్గుతుంది. కొన్నిసార్లు ల్యాప్‌టాప్ అకస్మాత్తుగా షట్ డౌన్ అవుతుంది. ఇది హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు నష్టం కలిగిస్తుంది. ల్యాప్‌టాప్‌ వేడెక్కకుండా ఉండాలంటే దాని కింద కూలింగ్ ప్యాడ్‌ని అమర్చాలి. అలాగే ల్యాప్‌టాప్ వెలుపల, స్క్రీన్‌పై దుమ్ము పేరుకుపోవద్దు. దీనితో పాటు మీరు ల్యాప్‌టాప్‌ను వాడకుండా ఉన్నప్పుడు క్లోజ్‌ చేసి ఉంచాలి. ఈ విషయాలను పాటిస్తే ల్యాప్‌టాప్ త్వరగా వేడెక్కకుండా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories