Jio: జియో యూజర్లకు బంపరాఫర్‌.. ఉచితంగా 100 జీబీ..

Jio
x

Jio

Highlights

Jio: తాజాగా నిర్వహించిన రియల్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ముకేష్‌ అంబానీ జియో క్లౌడ్‌ స్టోరేజ్‌ (jio cloud storage) సేవలను ఉపయోగించుకుంటున్న యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

Jio Cloud Offer: టెలికం రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన జియో.. యూజర్లను మరింత ఆకర్షించే పనిలో పడింది. ఇప్పటికే టెలికం రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోన్న జియో ఇంటర్నెట్‌ రంగంలో కూడా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా జియో క్లౌడ్‌ స్టోరేజ్‌ సేవలను సైతం అందిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో యూజర్లు తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ వంటి డేటాను క్లౌడ్‌లో స్టోర్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు ఈ సేవలు అందిస్తుండగా తాజాగా జియో సైతం క్లౌడ్‌ స్టోరేజ్‌ సేవలను అందిస్తోంది.

తాజాగా నిర్వహించిన రియల్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ముకేష్‌ అంబానీ జియో క్లౌడ్‌ స్టోరేజ్‌ సేవలను ఉపయోగించుకుంటున్న యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. జియో యూజర్లకు 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. జియో ఏఐ క్లౌడ్ పేరుతో ఈ సర్వీస్‌ను ముకేష్ అంబానీ ప్రకటించారు. జియో ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా జియో యూజర్లు 100 జీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా అందించనున్నారు. దీంతో యూజర్లు తమ డేటాను క్లౌడ్‌లో స్టోరేజ్‌ చేసుకోవచ్చు. అయితే 100 జీబీ కంటే ఎక్కువ స్టోరేజ్‌ కావాలనుకునే వారు డబ్బులు చెల్లించి స్టోరేజ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. దీపావళి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ముకేష్‌ అంబానీ ప్రకటించారు.

ఈ సందర్భంగా ముకేష్‌ అంబానీ మాట్లాడుతూ.. క్లౌడ్ డేటా స్టోరేజ్, డేటా ఆధారిత AI సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే శక్తివంతమైన పరిష్కారాన్ని తీసుకువస్తోందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గూగుల్ స్టోరేజ్‌ 100 జీబీ స్టోరేజ్‌ కోసం నెలకు రూ. 130 వసూలు చెస్తుండగా, యాపిల్‌ 50 జీబీకి రూ.75 వసూలు చేస్తుంది. అయితే జియో 100 జీబీ వరకు ఉచితంగా అందిస్తుండడంతో క్లౌడ్‌ స్టోరేజ్‌ సేవల్లో తీవ్రమైన పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories