Recharge plan: జియో యూజ‌ర్ల‌కు పండ‌గే.. అదిరిపోయే కొత్త ప్లాన్స్

Recharge plan
x

Recharge plan: జియో యూజ‌ర్ల‌కు పండ‌గే.. అదిరిపోయే కొత్త ప్లాన్స్

Highlights

Recharge plan: టెలికాం రంగంలో జియో మరోసారి వినియోగదారులను ఆకట్టుకునేలా నూతన ఆఫర్లను ప్రవేశపెడుతోంది. ఇటీవల రీఛార్జ్ రేట్లు పెరిగిన నేపథ్యంలో, వినియోగదారుల సంఖ్యలో కొంత తగ్గుదల కనిపించడంతో... మళ్లీ తమ వైపు ఆకర్షించేందుకు కంపెనీ ప్రత్యేక ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది.

అందులో భాగంగా, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం జియో ఇప్పుడు 3 నెలల బ్లాక్ బస్టర్ స్పెషల్ ఆఫర్ ను ప్రారంభించింది. అయితే ఇది లిమిటెడ్ టైం ఆఫర్ కావడంతో, వినియోగదారులు త్వరగా ఈ ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాన్‌ను MY Jio App ద్వారా లేదా దగ్గరలోని జియో స్టోర్‌ను సంప్రదించి పొందవచ్చు. వినియోగదారులు 3 నెలలు, 6 నెలలు, లేదా 12 నెలల వ్యవధికి ప్లాన్ ఎంపిక చేసుకోవచ్చు.

ఈ ఆఫర్ ప్రత్యేకతలు:

ఇంటర్నెట్ స్పీడ్‌ను తగ్గించకుండా స్థిరమైన వేగంతో పొందొచ్చు. ఎక్కువసేపు ఇంటర్నెట్ ఉపయోగించినా, అదనపు రీఛార్జ్ అవసరం లేదు. జియోసినిమా, జియోటీవీ, జియో క్లౌడ్ వంటి ఓటీటీ సేవ‌లు పొందొచ్చు. తరచూ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా లాంగ్ టర్మ్ ప్లాన్. ఇంటర్నెట్ స్పీడ్ 30 Mbps నుండి 300 Mbps+ వరకు లభిస్తుంది.

ఈ ప్లాన్ ప్రారంభ ధర రూ.399 (30 Mbps స్పీడ్) నుంచి మొదలవుతుంది. మరిన్ని స్పీడ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.

రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు:

ఇటీవల జియో తిరిగి ప్రవేశపెట్టిన రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా వినియోగదారులకు బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ ల‌భిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఉచిత‌ SMSలు,

2GB హై స్పీడ్ డేటా + అనంతరం 64Kbps అపరిమిత డేటా, జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సేవ‌లు పొందొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories