Jio: వావ్‌.. రూ.3599 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ.. 912 జీబీ డేటాతోపాటు ఓటీటీలు చూసే అవకాశం

Jio: వావ్‌.. రూ.3599 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ.. 912 జీబీ డేటాతోపాటు ఓటీటీలు చూసే అవకాశం
x
Highlights

Jio 1 Year Validity Plan: రిలయన్స్ జియో కంపెనీ ప్రైవేట్ దిగ్గజ కంపెనీకి 46 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు.

Jio 1 Year Validity Plan: రిలయన్స్ జియో కంపెనీ ప్రైవేట్ దిగ్గజ కంపెనీకి 46 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు. కొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటున్న ఈ కంపెనీ తాజాగా రూ.3599 ప్లాన్ అందుబాటులోకి తీసుకోవచ్చింది.

రూ. 3599 ఏడాది ప్లాన్ 912 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్రైవేట్ దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో అందిస్తున్న ఆకర్షణీయమైన ప్లాన్స్‌ అందిస్తుంది. మొత్తంగా జియో 46 కోట్ల మందికి పైగా యూజర్లను కలిగి ఉంది. అయితే ప్రధానంగా ఏడాది మొత్తం రీఛార్జీ పొందాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు.

జియో లాంగ్ టైం వ్యాలిడిటీ ప్లాన్ రెండు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.3599 ప్లాన్, 3999 ప్లాన్ ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు డేటా ఉచితం, ఓటీటీలు కూడా పొందుతారు.

రూ. 3599 ప్లాన్ లో ఏడాది మొత్తం వ్యాలిడిటీ పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్ తో ఏ నెట్‌ వర్క్‌ అయినా ఉచితంగా కాల్‌ చేసుకునే సదుపాయం ఉంది. అంతేకాదు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ 912 జీబీ డేటా పొందుతారు. అంటే ప్రతిరోజు 2.5 జిబి డేటా పొందుతారు. అయితే డేటా పూర్తయిపోయిన తర్వాత 64 కేబిపిఎస్ కూడా అందుకుంటారు. అయితే మీ ఏరియాలో ఒకవేళ 5G స్పీడ్‌ నెట్‌ అందుబాటులో ఉంటే హైస్పీడ్‌లో డేటా పొందే అవకాశం ఉంది

ఈ జియో ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే ఓటీటీ బెనిఫిట్స్ కూడా పొందుతారు. ప్రధానంగా క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. రూ. 3599 ప్లాన్ ను 90 రోజులు వ్యాలిడిటీ పొందుతారు. ఉచితంగా జియో సినిమా ప్రీమియం పొందుతారు. ఇది మాత్రమే కాకుండా సినిమాలు, క్రీడలు, వెబ్ సిరీస్ లు కూడా వీక్షించే అవకాశం ఉంది. అదనంగా 50gb జియో స్టోరేజ్ కూడా పొందుతారు. జియో టీవీ, ఎంటర్టైన్మెంట్ యాక్సెస్ కూడా ఉచితం.

ఈ రీఛార్జ్ ప్లాన్‌ జియో యూజర్లు ఎక్కువ డేటా వాడే వాళ్లకి ఎంతో బెస్ట్ అని చెప్పొచ్చు. దీంతోపాటు ఓటీటీలను కూడా వీక్షించవచ్చు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా డేటా ప్లస్ ఓటిటిలను చూసి అవకాశం దొరుకుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories