Cheapest 5G Smartphone: దేశంలోనే అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర కేవలం రూ.10,000 లోపే..!

Itel Company will Launch the Cheapest 5G Smartphone in the Country
x

Cheapest 5G Smartphone: దేశంలోనే అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర కేవలం రూ.10,000 లోపే..!

Highlights

Cheapest 5G Smartphone: ఇటీవలపెద్ద కంపెనీలు మాత్రమే 5G స్మార్ట్‌ఫోన్లని విడుదల చేస్తున్నాయి. వీటి ధర ఎక్కువగా ఉంటుంది.

Cheapest 5G Smartphone: ఇటీవలపెద్ద కంపెనీలు మాత్రమే 5G స్మార్ట్‌ఫోన్లని విడుదల చేస్తున్నాయి. వీటి ధర ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక కంపెనీ మాత్రం రూ.10000 లోపే 5G స్మార్ట్‌ఫోన్‌ అందించడానికి సిద్ధమైంది. ఈ సెప్టెంబర్‌ నెలాఖరులో విడుదలచేయనుంది. ఈ కంపెనీ పేరు ఐటెల్‌ (itel). ఈ చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర గురించి పూర్తిగా తెలుసుకుందాం.

itel P55 5G

iTel సెప్టెంబర్ చివరలో తన మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి యోచిస్తోంది. ఈ ఫోన్‌ను iTel P55 5G అని పిలుస్తారు. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేస్తున్నారు. iTel P55 5G ధర రూ.10,000 కంటే తక్కువగాను ఉంటుంది. ఇది భారతదేశంలో అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌గా మారుతుంది. కంపెనీ సీఈఓ 2023 ప్రారంభంలో తాము 5జీ ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఐటెల్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకురావడానికి ప్రసిద్ధి చెందింది. వీటి ధర దాదాపు రూ.8,000. కంపెనీ ట్యాబ్లెట్ రూ.12వేలకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా సరసమైన 5G ఫోన్‌ను కూడా పరిచయం చేయబోతోంది.

కంపెనీ కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ టీజర్‌ని విడుదల చేసింది. ఈ ఫోన్‌లో రెండు బ్యాక్‌ కెమెరాలు ఉంటాయి. ఫోన్ సరైన పరిమాణంలో పవర్ బటన్, వాల్యూమ్ కీలను కలిగి ఉంటుంది. లాంచ్‌కి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఇటీవల భారతదేశంలో P40+, A60s బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేసింది. మొదటి ధర రూ.8,099 కాగా, రెండోది రూ.6,299. P40+ 7000mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. A60s 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories