Internet Speed Tips: మీ స్మార్ట్ఫోన్లో ఇంటర్నెట్ స్లో అవుతుందా.. వీటిని సెట్ చేస్తే స్పీడప్ అవుతుంది..!

Is The Internet Slow On Your Smartphone If You Set These Things It Will Speed Up
x

Internet Speed Tips: మీ స్మార్ట్ఫోన్లో ఇంటర్నెట్ స్లో అవుతుందా.. వీటిని సెట్ చేస్తే స్పీడప్ అవుతుంది..!

Highlights

Internet-net- Speed Tips: ఆధునిక కాలంలో అన్ని పనులు స్మార్ట్ఫోన్ ద్వారా సులభంగా జరుగుతున్నాయి. దాదాపు అందరూ ఇంట్లో ఉండే అన్ని పనులను ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేస్తున్నారు.

Internet-net- Speed Tips: ఆధునిక కాలంలో అన్ని పనులు స్మార్ట్ఫోన్ ద్వారా సులభంగా జరుగుతున్నాయి. దాదాపు అందరూ ఇంట్లో ఉండే అన్ని పనులను ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేస్తున్నారు. 5జి అందుబాటులోకి వచ్చాక పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే స్మార్ట్ఫోన్ వాడే వారి సంఖ్య కూడా ఘణనీయంగా పెరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొన్నిసార్లు మనం ముఖ్యమైన పనిచేస్తుంటే మొబైల్లో నెట్ స్లో అయిపోతుంది. దీనివల్ల చాలా ఇబ్బందిపడుతుంటాం. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయిందంటే కొన్ని విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మీ రిచార్జ్ ప్లాన్ యాక్టివ్లో ఉండి మీ ఫోన్లో ఇంటర్నెట్ స్లో అయిందంటే ముందుగా మీ స్మార్ట్ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఆన్ చేయాండి. దీనివల్ల ఏవైనా తాత్కాలిక అవాంతరాలు ఉంటే తొలగిపోతాయి. నెట్‌వర్క్‌కి మీ కనెక్షన్‌ని రిఫ్రెష్ చేస్తుంది. ఒకవేళ ఇలా చేయకూడదనుకుంటే ఒక్కసారి ఫోన్లో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆఫ్ చేసి ఆన్ చేయండి. కొన్నిసార్లు సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడం వల్ల కూడా ఇంటర్నెట్ స్లో అవుతుంటుంది. మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవడం అవసరం. సెట్టింగ్‌ మెనులో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల గురించి చెక్ చేయడం వల్ల మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్‌ అమలవుతుందో లేదో తెలుస్తుంది.

పీసీలు, ల్యాప్‌టాప్‌లలో యాప్‌లు, ఆండ్రాయిడ్ సిస్టమ్ నుంచి ఫోన్‌లలో కాష్ చేసిన డేటా అధికంగా స్టోర్ అవుతుంది. ఇది మీ ఇంటర్నెట్ వేగాన్ని తగ్గిస్తుంది. మీ వెబ్ బ్రౌజర్ తరచుగా ఉపయోగించే యాప్‌ల కాష్‌ని క్రమం తప్పకుండా క్లియర్ చేస్తూ ఉండాలి. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్‌లు ఓపెన్ అయి ఉంటాయి. మీ బ్రౌజర్‌లో కూడా చాలా వెబ్‌సైట్‌లు ఓపెన్ అయి ఉంటాయి. ఇవన్నీ డేటా వినియోగిస్తాయి. అందుకే వీటిని క్లోజ్ చేసి ఫోన్ రీబూట్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు మీ నెట్‌వర్క్ వేగాన్ని తగ్గించగలవు. ఏదైనా నిర్దిష్ట యాప్ సాధారణం కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తోందో లేదో చూడటానికి సెట్టింగ్‌ల మెనులో మీ డేటా వినియోగాన్ని చెక్ చేయాలి. మీకు అవసరం లేని యాప్ ఎక్కువ డేటా వినియోగిస్తుంటే దానిని క్యాన్సిల్ చేసి మీకు అవసరమైన యాప్ని సెట్ చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories