Data Settings: స్మార్ట్‌ఫోన్‌ డేటా తొందరగా అయిపోతుందా.. ఈ సెట్టింగ్‌ చేయకుంటే అంతే సంగతులు..!

Is The Data Running Out Quickly From The Smartphone Immediately Do This Setting On The Phone
x

Data Settings: స్మార్ట్‌ఫోన్‌ డేటా తొందరగా అయిపోతుందా.. ఈ సెట్టింగ్‌ చేయకుంటే అంతే సంగతులు..!

Highlights

Data Settings: కొన్నిసార్లు ఫోన్‌లో నెట్‌ వాడుతున్నప్పుడు చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకు ఇలా జరిగిందో చాలా మందికి అర్థం కాదు.

Data Settings: కొన్నిసార్లు ఫోన్‌లో నెట్‌ వాడుతున్నప్పుడు చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకు ఇలా జరిగిందో చాలా మందికి అర్థం కాదు. వెంటనే బ్యాలెన్స్‌ చెక్‌ చేస్తారు కానీ అసలు విషయం తెలుసుకోరు. ఫోన్‌లో కొన్ని రకాల సెట్టింగ్స్‌ చేయకుంటే డాటా తొందరగా అయిపోతుంది. అయితే ఈ సెట్టింగ్స్‌ ఏ విధంగా చేయాలో ఈరోజు తెలుసుకుందాం.

వాస్తవానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో రకరకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్లే స్టోర్ సదుపాయం ఉంటుంది. దీని ద్వారా డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌లు తరచుగా అప్‌డేట్‌ అవుతుంటాయి. ఇవి అప్‌డేట్‌ కావడానికి డేటా అవసరం. దీంతో మొబైల్‌ డేటా మొత్తం వీటి అప్‌డేట్‌కి ఖర్చయిపోతుంది. దీంతో మీకు తెలియకుండానే ఫోన్‌లోని డేటా తొందరగా అయిపోతుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు.

ఈ విధంగా సెట్టింగ్‌ చేయండి

1. ముందుగా ప్లే స్టోర్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి.

2. తర్వాత కుడి వైపున పైన కనిపించే ప్రొఫైల్ గుర్తుపై క్లిక్ చేయాలి.

3. ఇందులో సెట్టింగ్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

4. తర్వాత నెట్‌వర్క్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

5. తర్వాత ఆటో-అప్‌డేట్ యాప్‌లతో కూడిన ఎంపికపై క్లిక్ చేయాలి.

6. ఇక్కడ ' డోంట్‌ ఆటో-అప్‌డేట్ యాప్‌పై క్లిక్‌ చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories