iQOO 15 Ultra: 7400mAh బ్యాటరీ, మూడు 50MP కెమెరాస్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు కొత్త బెంచ్‌మార్క్ ఐకూ 15 అల్ట్రా!

iQOO 15 Ultra: 7400mAh బ్యాటరీ, మూడు 50MP కెమెరాస్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు కొత్త బెంచ్‌మార్క్ ఐకూ 15 అల్ట్రా!
x

iQOO 15 Ultra: 7400mAh బ్యాటరీ, మూడు 50MP కెమెరాస్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు కొత్త బెంచ్‌మార్క్ ఐకూ 15 అల్ట్రా!

Highlights

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మరోసారి సంచలనం సృష్టించేందుకు చైనాకు చెందిన వివో అనుబంధ మొబైల్‌ తయారీ సంస్థ 'ఐకూ' సిద్ధమవుతోంది.

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మరోసారి సంచలనం సృష్టించేందుకు చైనాకు చెందిన వివో అనుబంధ మొబైల్‌ తయారీ సంస్థ 'ఐకూ' సిద్ధమవుతోంది. కంపెనీ తీసుకొస్తున్న ఐకూ 15 అల్ట్రా (iQOO 15 Ultra) ఫ్లాగ్‌షిప్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇప్పటికే టెక్ వర్గాల్లో భారీ చర్చకు దారి తీస్తున్నాయి. డిస్‌ప్లే నుంచి కెమెరా, గేమింగ్ ఫీచర్లు నుంచి బ్యాటరీ వరకు.. ప్రతీ విభాగంలోనూ ఈ డివైస్ అల్ట్రా లెవల్ అనుభూతిని అందించనుందని తెలుస్తోంది. ఐకూ 15 అల్ట్రా లీకైన స్పెక్స్ ఏంటో ఓసారి చూద్దాం.

ఐకూ 15 అల్ట్రాలో 6.85 అంగుళాల 2K+ రిజల్యూషన్, 144Hz LTPO Samsung M14 ఫ్లాట్ డిస్‌ప్లే ఉండనుంది. అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు, లోకల్ పీక్ బ్రైట్‌నెస్ 8000 నిట్స్ వరకు సపోర్ట్ చేయడం విశేషం. దాంతో అవుట్‌డోర్‌లో కూడా స్క్రీన్ క్లారిటీ అద్భుతంగా ఉండనుంది. ఫోటోగ్రఫీ ప్రియులకు ఈ ఫోన్ ఒక ట్రీట్‌లా మారనుంది. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఉండగా.. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా (1/1.56 సెన్సార్), 50MP అల్ట్రా వైడ్ లెన్స్, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (1/1.95) ఉండే అవకాశాలు ఉన్నాయి. మెయిన్, టెలిఫోటో కెమెరాలకు OIS (CIPA 4.5) సపోర్ట్ ఉండటంతో.. అద్భుత ఫోటోలు, వీడియోలు సులభంగా క్యాప్చర్ చేయవచ్చు.

పెర్ఫార్మెన్స్ విషయంలో ఐకూ 15 అల్ట్రా అస్సలు రాజీ పడడం లేదు. ఇందులో Snapdragon 8E5 ఫ్లాగ్‌షిప్ SoCతో పాటు కస్టమ్ Q3 గేమింగ్ చిప్ ఇవ్వనున్నారు. గరిష్టంగా 24GB RAM మరియు 1TB స్టోరేజ్ ఆప్షన్ ఉండే అవకాశం ఉంది. అదనంగా యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, ప్రెషర్ సెన్సిటివ్ షోల్డర్ ట్రిగర్స్ ఉండటం వల్ల గేమింగ్ అనుభవం మరో స్థాయిలో ఉండనుంది. ఈ ఫోన్‌లో 7400mAh భారీ సింగిల్ సెల్ బ్యాటరీ ఇవ్వనున్నారు. 100W వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో చాలా తక్కువ సమయంలో బ్యాటరీ ఫుల్ అవుతుంది.

ఐకూ 15 అల్ట్రాలో డ్యూయల్ యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్స్ (091640), 1115 కోయాక్షియల్ సిమెట్రికల్ స్టీరియో స్పీకర్స్ ఉండనున్నాయి. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అలాగే IP68 / IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అందించడం విశేషం. కనెక్టివిటీ పరంగా USB-C 3.2 Gen 1, N79 5G బ్యాండ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. చైనా మార్కెట్‌లో 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌కు అంచనా ధర 6,300 – 6,800 యూవాన్స్ మధ్యగా ఉండొచ్చని సమాచారం. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.76,500 – 83,500గా ఉండనుంది. మొత్తానికి ఐకూ 15 అల్ట్రా స్పెసిఫికేషన్స్ చూస్తే.. ఇది 2026లో వచ్చే బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్‌లో ఉన్న టాప్ ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories