iPhone 16 : కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? ఐఫోన్ 16పై వేల రూపాయలు ఆదా

iPhone 16
x

iPhone 16 : కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? ఐఫోన్ 16పై వేల రూపాయలు ఆదా

Highlights

iPhone 16 : ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి గుడ్ న్యూస్. ఐఫోన్ 17 మార్కెట్‌లోకి రాకముందే ప్రస్తుత మోడల్ ఐఫోన్ 16 పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

iPhone 16 : ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి గుడ్ న్యూస్. ఐఫోన్ 17 మార్కెట్‌లోకి రాకముందే ప్రస్తుత మోడల్ ఐఫోన్ 16 పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈఎంఐ ఆప్షన్‌పై కూడా పొందవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో అనేక ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తున్నారు.

అమెజాన్‌లో ఐఫోన్ 16 128 GB మోడల్ డిస్కౌంట్‌తో కేవలం రూ.73,000 కు లభిస్తోంది. సెలక్ట్ చేసిన క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేస్తే అదనంగా రూ.4,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఒకేసారి మొత్తం ధర చెల్లించకూడదనుకుంటే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా మీరు నెలకు కేవలం రూ.3,539 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి, కొత్త ఫోన్ ధరలో వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఐఫోన్ 16 ఐదు రంగులలో అందుబాటులో ఉంది. నచ్చిన కలర్ సెలక్ట్ చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ నుండి కూడా ఐఫోన్ 16ను కేవలం రూ.74,900 కు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను అందిస్తోంది. ఐఫోన్ 16లో అద్భుతమైన 48MP ఫ్యూజన్ కెమెరా ఉంది, ఇది చాలా క్వాలిటీ ఫోటోలను తీస్తుంది. ప్రో మోడల్‌లో 5x టెలిఫోటో జూమ్, మాక్రో ఫోటోగ్రఫీ, స్పేషియల్ ఫోటో వంటి అడ్వాన్స్ డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌తో 4K 120fps డాల్బీ విజన్ వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. ఐఫోన్ 16 లో కొత్త కెపాసిటివ్ కెమెరా బటన్ ఉంది. దీని ద్వారా యూజర్లు కెమెరాను మరింత వేగంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ డివైజ్‌లో అద్భుతమైన ఫీచర్లు, మెరుగైన స్టోరేజ్ ఆప్షన్లు, పర్ఫామెన్స్ ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ఫోన్‌లో యూనిక్ కలర్ ఆప్షన్స్ కూడా లభిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories