iPhone 15 Price Drop: భారీగా పడిపోయిన ఐఫోన్ 15 ప్రైస్.. సగం ధరకే కొనుగోలు చేయండి..!

iPhone 15 Price
x

iPhone 15 Price Drop

Highlights

iPhone 15 Price Drop: ఐఫోన్ 15 మొబైల్‌ను ఆపిల్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే కొనుగోలు చేయవచ్చు.

iPhone 15 Price Drop: కాలిఫోర్నియా టెక్ కంపెనీ ఆపిల్‌ ఐఫోన్‌లకు భారతీయ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనుకుంటారు. ముఖ్యంగా నేటి యూత్ డ్రీమ్స్‌లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. అయితే మొబైల్ లవర్స్ చాలా మంది భారీ డిస్కౌంట్‌లతో ఐఫోన్ మోడళ్లను కొనాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే కంపెనీ తన బ్రాండ్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పుడు ఐఫోన్ 15పై భారీ ఆఫర్ ప్రకటించింది. మీరు రూ.45 వేల లోపు కొనుగోలు చేయవచ్చు. స్పెషల్ డిస్కౌంట్ అనేది ఆపిల్ iStoreలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 15 ఆఫర్ల గురించి చెప్పాలంటే iPhone 15 అసలు ధరలో సగానికి కొనుగోలు చేయవచ్చు. ఇండియా iStore డీల్‌ను దాని వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 15 అసలు ధర దేశీయ మార్కెట్లో రూ. 79,600గా ఉంది. దీనిపై ఆపిల్ రూ.5000 డిస్కౌంట్ అందిస్తుంది. దీని తర్వాత మీరు రూ. 74,600కి ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ICICI బ్యాంక్ లేదా SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపు చేస్తే, రూ. 4000 తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.

అంటే ఫోన్‌ను రూ. 70,600. ఇప్పుడు మీరు ఐఫోన్ 15 ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో కస్టమర్‌లు ఐఫోన్ 12 లేదా మోడల్‌లను ఎక్స్ఛేంజ్ చేసినట్లయితే బంపర్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఐఫోన్ 12పై రూ. 20,000 ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌తో రూ. 6000 అదనపు తగ్గింపును కూడా అందుబాటులో ఉంది.

ఆ తర్వాత iPhone 15 ధర రూ. 44,600కి తగ్గుతుంది. ఎక్స్‌ఛేంజ్ చేయడానికి మీ వద్ద iPhone 12 లేకపోతే మీకు విజయ్ సేల్స్‌‌ బెస్ట్ ఆఫర్లను అందిస్తుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో iPhone 12 బేస్ మోడల్ రూ. 69,690గా ఉంటుంది. ఇది కాకుండా, ICICI బ్యాంక్ లేదా SBI బ్యాంక్ కార్డ్‌ల సహాయంతో పేమెంట్ చేస్తే 4000 రూపాయల అదనపు తగ్గింపు లభిస్తుంది. దీని తర్వాత ఫోన్ ధర రూ.65,690 మాత్రమే.

Show Full Article
Print Article
Next Story
More Stories