Infinix Solar Power and Color Changing Phone: టెక్నాలజీ అదిరింది.. ఎండతో ఛార్జ్ అయ్యే ఫోన్ వచ్చేసింది..!

Infinix Solar Power and Color Changing Phone: టెక్నాలజీ అదిరింది.. ఎండతో ఛార్జ్ అయ్యే ఫోన్ వచ్చేసింది..!
x

Infinix Solar Power and Color Changing Phone: టెక్నాలజీ అదిరింది.. ఎండతో ఛార్జ్ అయ్యే ఫోన్ వచ్చేసింది..!

Highlights

Infinix Solar Power and Color Changing Phone: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025లో Infinix అందరిని ఆశ్చర్యపరుస్తూ రెండు కొత్త కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. ఇందులో ఒకటి సౌరశక్తితో ఛార్జయ్యేది, మరొకటి 'ఊసరవెల్లి'లా రంగు మార్చే ఫోనన్.

Infinix Solar Power and Color Changing Phone: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025లో Infinix అందరిని ఆశ్చర్యపరుస్తూ రెండు కొత్త కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. ఇందులో ఒకటి సౌరశక్తితో ఛార్జయ్యేది, మరొకటి 'ఊసరవెల్లి'లా రంగు మార్చే ఫోనన్. ఈ ఫోన్లు ఇప్పటికీ ప్రోటోటైప్ దశలోనే ఉన్నప్పటికీ, మొబైల్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణల వైపు బ్రాండ్ కదలికను ఇది చూపిస్తుంది. ఈ రెండు ఫోన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Solar Power Smartphone

ఇన్ఫినిక్స్ సౌరశక్తితో పనిచేసే ఫోన్‌కు వెనుక భాగంలో సోలార్ ప్యానెల్ అమర్చారు. దీనికి కంపెనీ సోలార్ ఎనర్జీ-రిజర్వింగ్ టెక్నాలజీ అని పేరు పెట్టింది. ఇది సాధారణ సిలికాన్ ఆధారిత సోలార్ ప్యానెల్‌ల కంటే సన్నగా, మరింత సులభంగా ఉత్పత్తి చేసే పెరోవ్‌స్కైట్ సోలార్ సెల్‌లను ఉపయోగిస్తుంది.

అంతే కాకుండా గరిష్ట పవర్ పాయింట్ ట్రాకింగ్ అంటే MPPT సిస్టమ్ ఈ ఫోన్‌లో ఉపయోగించారు. ఇది శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ప్రత్యక్ష సూర్యకాంతిలో వేడెక్కకుండా కూడా రక్షిస్తుంది. ప్రస్తుతం, ఈ సౌర వ్యవస్థ 2W వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు, ఇది ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి బదులుగా బ్యాటరీ జీవితాన్ని పొడిగించడానికి రూపొందించారు.

Solar Power Mobile Case

ఇన్ఫినిక్స్ సౌరశక్తితో నడిచే కేస్ ఫోన్ కంటే మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈ రిమూవ్‌బుల్ కేస్‌లో ఇంటర్నల్ సోలార్ ప్యానెల్‌లు ఉన్నాయి, ఇది సైడ్ కాంటాక్ట్ సిస్టమ్ ద్వారా ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది. ప్రత్యేక ఛార్జింగ్ పోర్ట్ అవసరాన్ని పూర్తిగా తొలగిస్తుంది.

Color Changing Smartphone

సౌరశక్తితో పనిచేసే ఫోన్‌లతో పాటు ఇన్ఫినిక్స్ కలర్ మారే E Ink ఫోన్ 2వ జెన్ మోడల్‌ను కూడా పరిచయం చేసింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈసారి ఛార్జింగ్ సమయంలో మాత్రమే కలర్ మారుతుంది, అయితే కొత్త మోడల్ ఫోన్ బ్యాటరీ నుండి శక్తిని తీసుకుంటుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories