ఇండియన్స్‌ స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తున్నారు.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..!

Indians Mostly Use Smartphone For What Shocking Facts In A Study
x

ఇండియన్స్‌ స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తున్నారు.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..!

Highlights

Indians Use Smartphone: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. జీవితంలో ఇవి ఒక ముఖ్య భాగంగా మారాయి.

Indians Use Smartphone: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. జీవితంలో ఇవి ఒక ముఖ్య భాగంగా మారాయి. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టారంటే చాలు ఫోన్‌ జేబులో ఉండాల్సిందే. అలాగే ఇంటర్నెట్‌ సహాయంతో అన్ని పనులు సులువుగా చేస్తున్నారు. సోషల్ మీడియాని సందర్శించడం, గేమ్‌లు ఆడడం, వీడియోలు చూడటం వంటి అనేక పనులను చేస్తున్నారు. అయితే ఇటీవల Vivo ఒక పరిశోధన నివేదికను విడుదల చేసింది. ఇందులో భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్‌లని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తురో తెలిసింది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్‌ వాడటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం 86% మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లిస్తున్నారు. ఇది చాలా మంచి పద్దతి దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అలాగే సుమారు 80.8% మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. 61.8% మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నిత్యావసర వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. దాదాపు 66.2% మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఆన్‌లైన్ సేవలని బుక్ చేసుకుంటున్నారు. దాదాపు 73.2% మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి కిరాణా వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. 58.3% మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి డిజిటల్ నగదు చెల్లింపులు చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే పురుషుల సంఖ్య మహిళల కంటే ఎక్కువ. దాదాపు 62% మంది పురుషులు స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉండగా, 38% మంది స్త్రీలు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు. పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య కూడా తేడా ఉంది. పట్టణ ప్రజలలో 58% మంది స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉంటే, గ్రామీణ ప్రజలలో 41% మంది మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు. దీనిని బట్టి స్మార్ట్‌ఫోన్‌ విప్లవం ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories