Smart Phone: భార‌త్‌లో ఎక్కువ‌గా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్ ఏంటో తెలుసా.?

Smart phone: భార‌త్‌లో ఎక్కువ‌గా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్ ఏంటో తెలుసా.?
x

Smart phone: భార‌త్‌లో ఎక్కువ‌గా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్ ఏంటో తెలుసా.?

Highlights

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 2025 మొదటి త్రైమాసికం (జనవరి - ఏప్రిల్) ఊహించిన దానికంటే మిశ్రమ ఫలితాలనే ఇచ్చింది.

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 2025 మొదటి త్రైమాసికం (జనవరి - ఏప్రిల్) ఊహించిన దానికంటే మిశ్రమ ఫలితాలనే ఇచ్చింది. సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) తాజా నివేదిక ప్రకారం, ఈ కాలంలో దేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 7 శాతం తగ్గాయి. ముఖ్యంగా రూ.7,000 నుంచి రూ.25,000 మధ్య ధరగల ఫోన్లు 6 శాతం తగ్గగా, రూ.25,000 పైబడే మోడళ్ల వృద్ధి కూడా తగ్గుముఖం పట్టింది.

5G ఫోన్లకు పెరుగుతున్న ఆదరణ:

అయితే, 5G ఫోన్ల విభాగం మాత్రం వేగంగా ముందుకు సాగుతోంది. 2025 మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా అమ్ముడైన మొబైల్స్‌లో 5G ఫోన్లు 86 శాతం వాటాను దక్కించుకున్నాయి. ముఖ్యంగా రూ.8,000 - రూ.13,000 మధ్య ధరల ఫోన్లకు మంచి ఆదరణ లభించిందని నివేదికలో పేర్కొన్నారు.

రూ.10,000లోపు 5G ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వినియోగదారులు తక్కువ ధరలో 5G ఫీచర్లు పొందాలనే ఉద్దేశంతో షియోమి, పోకో, మోటరోలా, రియల్‌మీ వంటి బ్రాండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

మార్కెట్‌లో వివో దూకుడు – షియోమికి షాక్

ఈ త్రైమాసికంలో వివో భారత్‌లో అగ్రగామిగా నిలిచింది. కంపెనీ మార్కెట్ వాటా 20 శాతం పెరిగింది. వివో మోడల్స్‌ అయిన Y29, T3 Lite, T3X, T4X వంటి ఫోన్లు కలిసి 5G విభాగంలో 43 శాతం వాటా దక్కించుకోవడం గమనార్హం. శామ్‌సంగ్ 18 శాతం వృద్ధితో రెండో స్థానంలో నిలిచినా, దాని స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 13 శాతం తగ్గుదల కనిపించింది.

కానీ, షియోమికి ఈ త్రైమాసికం కఠినంగా మారింది. గతేడాది తో పోలిస్తే సంస్థ మార్కెట్ షేరు 13 శాతం పడిపోయింది. ముఖ్యంగా 2G, 4G ఫోన్ల అమ్మకాలు తీవ్రంగా క్షీణించాయి. 2G ఫోన్లు 17 శాతం తగ్గుతే, 4G ఫోన్ల అమ్మకాలు ఏకంగా 66 శాతం తగ్గిపోయాయి.

సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వినియోగదారుల అభిరుచి కూడా మారుతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే 5G ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు, 2G, 4G ఫోన్లకు మార్కెట్లో స్థానమే లేకుండా పోతున్నదని నివేదిక హెచ్చరిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories