WhatsApp Mistakes: వాట్సాప్‌లో ఈ తప్పులు చేస్తే జైలుకి వెళుతారు.. తెలుసుకోకుంటే నష్టపోతారు..!

If You do These Mistakes in WhatsApp you Will go to Jail if you Dont Know you will Lose
x

WhatsApp Mistakes: వాట్సాప్‌లో ఈ తప్పులు చేస్తే జైలుకి వెళుతారు.. తెలుసుకోకుంటే నష్టపోతారు..!

Highlights

WhatsApp Mistakes: స్మార్ట్‌ఫోన్‌ వచ్చినప్పటి నుంచి వాట్సాప్‌ని చాలామంది వాడుతున్నారు.

WhatsApp Mistakes: స్మార్ట్‌ఫోన్‌ వచ్చినప్పటి నుంచి వాట్సాప్‌ని చాలామంది వాడుతున్నారు. సమాచారాన్ని సులువుగా చేరవేస్తున్నారు. గతంలో ఏదైనా సంఘటన జరిగితే అది వెలుగులోకి రావడానికి చాలా సమయం పట్టేది. కానీ వాట్సాప్‌ పుణ్యమా అని ఇప్పుడు అది నిమిషాలలో ప్రజలకి తెలిసిపోతుంది. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. అయితే వాట్సాప్‌ ద్వారా మంచి మాత్రమే కాదు చెడు కూడా ప్రచారం జరుగుతోంది. మీరు దానిని జాగ్రత్తగా ఉపయోగించకుంటే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయాల గురించి తెలుసుకుందాం.

నిజానికి వాట్సాప్‌లో కొన్ని విషయాలని నిషేధించారు. అయితే వాటి గురించి తెలియని కొంతమంది వాటిని షేర్‌ చేయడం ద్వారా చిక్కుల్లో పడుతారు. అందుకే ఆ విషయాల గురించిన సమాచారం తెలిసి ఉండటం అత్యవసరం. ఆ ప్రమాదకర విషయాల గురించి అందరికి అవగాహన ఉండాలి. అవేంటో ఓ లుక్కేద్దాం.

1. చైల్డ్ పోర్నోగ్రఫీ

మీరు పొరపాటున వాట్సాప్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఫోటో లేదా వీడియోను షేర్ చేస్తే జైలుకు వెళ్లవలసి ఉంటుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా గత కొన్నేళ్లుగా ఢిల్లీ పోలీసులు చాలా మందిని అరెస్టు చేశారు. పొరపాటున కూడా వాట్సాప్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేయవద్దు.

2. సామాజిక వివక్షను వ్యాప్తి చేసే వీడియోలు

మీరు వాట్సాప్‌లో సమాజంలో వివక్షను వ్యాప్తి చేసే వీడియో, ఫోటో, మెస్సేజ్‌ పంపినా లేదా ఫార్వర్డ్‌ చేసినా చట్టాన్ని ఉల్లంఘించినవారవుతారు. ఏదైనా వాట్సాప్‌ గ్రూప్‌లో అలాంటి వీడియో కనిపిస్తే దానిని ఫార్వార్డ్ చేయకుండా వెంటనే డిలిట్‌ చేయండి. సమాజంలో వివక్షను వ్యాప్తి చేసే సందేశాలు, వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తే జైలు శిక్షకి గురవుతారు.

3. నకిలీ వార్తల ప్రచారం

ఫేక్ న్యూస్ విషయంలో వాట్సాప్ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. నకిలీ వార్తల విషయంలో ప్రభుత్వం కూడా యాక్షన్ మోడ్‌లో ఉంది. ఫేక్ న్యూస్ కారణంగా సమాజంలో, దేశంలో హింస లేదా వివక్ష లాంటివి వ్యాపిస్తే అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఈ స్థితిలో వాట్సాప్‌లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే వాట్సాప్‌లో వచ్చిన ప్రతి వార్తను వెంటనే షేర్ చేయకూడదు. అది సరియైనదా తప్పా అని నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories