Power Bank Damaged Symptoms: పవర్‌ బ్యాంక్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే బయట పడేయడం మంచిది..!

If the Power Bank Shows these Symptoms it Means it is Damaged do not use it
x

Power Bank Damaged Symptoms: పవర్‌ బ్యాంక్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే బయట పడేయడం మంచిది..!

Highlights

Power Bank Damaged Symptoms: ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం విపరీతంగా పెరిగింది.

Power Bank Damaged Symptoms: ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. చాలామంది వీటిని వెంటే ఉంచుకుంటున్నారు. ట్రావెల్‌ సమయంలో కూడా చాలామంది వీటి ద్వారా వర్క్‌ చేస్తున్నారు. అయితే ఇవి పనిచేయాలంటే కచ్చితంగా పవర్‌ అవసరం. కానీ అన్నిచోట్ల పవర్‌ లభించదు. అందుకే ఇలాంటి వారు పవర్‌ బ్యాంకులను మెయింటెన్‌ చేస్తారు. వీటిద్వారా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఛార్జ్‌ చేసి వాడుతారు.

చెడిపోయిన పవర్‌ బ్యాంకును ఉపయోగించడం చాలా ప్రమాదకరం. ఇది ఎలక్ట్రానిక్ పరికరం కాబట్టి దీనిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇది బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనిని తప్పుగా ఉపయోగిస్తే పేలుతుంది. మీ పవర్ బ్యాంక్‌లో ఈ 5 లక్షణాలు కనిపిస్తే వెంటనే దానిని మార్చేయండి. కొత్త పవర్ బ్యాంక్‌ని కొనుగోలు చేయండి. ఆ లక్షణాల గురించి తెలుసుకోండి.

1. ఉబ్బిన పవర్ బ్యాంక్: మీ పవర్ బ్యాంక్ ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే దాన్ని ఉపయోగించడం మానేసి బయట పారేయండి. ఇది తీవ్రమైన పేలుడుకు కారణం అవుతుంది.

2. ఓవర్ హీటింగ్: పవర్ బ్యాంక్ ఉపయోగిస్తున్నప్పుడు లేదా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు అది వేడెక్కుతున్నట్లయితే దాని వినియోగాన్ని ఆపివేయాలి. ఇది కూడా ప్రమాదమే ఇది మీకు హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి.

3. దుర్వాసన: పవర్ బ్యాంక్ నుంచి కాలిపోయిన ప్లాస్టిక్‌ వాసన వస్తే అది చెడిపోయిందని అర్థం. ఈ పరిస్థితిలో దానిని ఉపయోగించవద్దు.

4. తక్కువ ఛార్జింగ్: పవర్ బ్యాంక్ మునుపటి కంటే తక్కువ ఛార్జింగ్ రిసీవ్‌ చేసుకుంటే బ్యాకప్ పనితీరు బాగా లేదని అర్థం. చెడ్డ పోర్ట్ లేదా కేబుల్ మొదలైన వాటి కారణంగా ఛార్జింగ్ సమస్యలు ఎదురవుతాయి. ఇది జరిగితే దానిని ఉపయోగించవద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories