ICICI: వైద్య సేవ‌ల‌ను ప్రారంభించిన ఐసీఐసీఐ.. 24 గంట‌లు అందుబాటులో

ICICI who Launched Virtual Medical Services Through IL Take Care App Be fit Service Plan
x

ఐసీఐసిఐ కొత్ అప్ (ఫైల్ ఇమేజ్)

Highlights

ICICI: క‌రోనా వ‌ల్ల అంద‌రు ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు.

ICICI: క‌రోనా వ‌ల్ల అంద‌రు ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. భారతదేశ ప్రైవేట్ బీమా సంస్థ ICICI లాంబార్డ్ తన IL Take Care యాప్ ద్వారా బెఫిట్ సర్వీస్ ప్లాన్‌ని ప్రారంభించింది. ఇది OPD సేవల ప్రయోజనాలను అంటే వైద్యుల సంప్రదింపులు, ఫార్మసీ, డయాగ్నస్టిక్ సేవలు, ఫిజియోథెరపీ సెషన్‌లను వినియోగదారులకు నగదు రహిత పద్ధతిలో అందిస్తుంది. అదనంగా బహుళ వెల్నెస్ సేవల నుంచి ప్రయోజనం పొందేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది.

ఈ బృందంలో 11 వేల మంది వైద్యులు

లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి మాట్లాడుతూ.. "కోవిడ్ మహమ్మారి వినియోగదారులకు ఆరోగ్య భీమా అనేది ఎంత ముఖ్య‌మో తెలియ‌జేసింది. కేవలం ఆసుపత్రి ఖర్చులను కవర్ చేయడంతో బీమా పని అయిపోదు. రోజువారీ ఆరోగ్య ప‌రిస్థితిని కూడా గ‌మ‌నించాలి. మా కొత్త BeFit సొల్యూషన్ దీనిని లక్ష్యంగా చేసుకొని ప‌ని చేస్తుంది. ఇది ఫిట్‌గా ఉండాలనుకునే కస్టమర్‌లకు నగదు రహిత, కాంటాక్ట్‌లెస్ పరిష్కారాన్ని అందిస్తుంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా వారి వైద్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి ప‌రిష్క‌రిస్తుంది. ఇందులో వివిధ న‌గ‌రాల్లో 11,000 మందికి పైగా వైద్యులు చేర‌బోతున్నార‌నిష తెలిపారు.

ఓపీడీకి నగదు రహిత సౌకర్యం ఉంటుంది

బెఫిట్ సొల్యూషన్ కస్టమర్లకు వారి మొత్తం OPD అవసరాలకు నగదు రహిత ప్రాతిపదికన కవరేజీని అందిస్తుంది. సాధారణ, స్పెషలిస్ట్‌, సూపర్-స్పెషలిస్ట్ వైద్యులు అలాగే ఫిజియోథెరపీ సెషన్‌ల ద్వారా ఫిజికల్‌, వ‌ర్చువల్ కన్సల్టేషన్‌లలో క్లయింట్లు అనేక రకాల కవరేజీని పొందవచ్చు. ఫార్మసీ సర్వీస్ దానితో పాటు ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను కూడా అందిస్తుంది. అంటే 60 నిమిషాలలోపు ఔషధం, ఇంట్లో ల్యాబ్ టెస్ట్ సదుపాయం క‌ల్పిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories