Realme C63 5G: రూ.7,999కే 5జీ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా..!

Realme C63 5G
x

Realme C63 5G: రూ.7,999కే 5జీ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా..!

Highlights

Realme C63 5G: రియల్‌మీ మొబైల్ ప్రియుల కోసం ఇదిగో పెద్ద ఆఫర్. మీరు ఈ చవకైన 5G ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకు కొనచ్చు. Realme C63 5G మొబైల్ ధర భారీగా తగ్గింది.

Realme C63 5G: రియల్‌మీ మొబైల్ ప్రియుల కోసం ఇదిగో పెద్ద ఆఫర్. మీరు ఈ చవకైన 5G ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకు కొనచ్చు. Realme C63 5G మొబైల్ ధర భారీగా తగ్గింది. 8జీబీ ర్యామ్‌తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.7,999కే దక్కించుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్, నో కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ బేస్ ధర, ఆఫర్‌లు , స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.

Realme C63 5G Offers

రియల్‌మీ C63 5G మొబైల్ 4GB + 64GB, 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ధర వరుసగా రూ.8,499. రూ. 8,999గా ఉంది ఈ ఫోన్‌పై కంపెనీ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.500 తగ్గింపును అందిస్తోంది. మీరు ఫోన్ 64GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.7,999, 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.8,499కి ఆర్డర్ చేయచ్చు. స్మార్ట్‌ఫోన్ లెదర్ బ్లూ, జేడ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Realme C63 5G Features

రియల్‌మీ C63 5G మొబైల్‌లో 6.67 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 720×1604 పిక్సెల్ రిజల్యూషన్ సపోర్ట్‌తో వస్తుంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 625 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఆర్మ్ మాలి G57 MC2 GPUని కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 5.0లో రన్ అవుతుంది. ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ 8GB RAM +128GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది.

మొబైల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో LED ఫ్లాష్‌తో 32-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఫోన్‌లో 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఇందులో రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. కనెక్టివిటీలో 3.5mm ఆడియో జాక్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS5, USB టైప్-సి ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories