Honor Power 2: 10080mAh బ్యాటరీతో హానర్ పవర్ 2.. ఇక ఛార్జర్‌తో పనేలేనట్లే..!

Honor Power 2: 10080mAh బ్యాటరీతో హానర్ పవర్ 2.. ఇక ఛార్జర్‌తో పనేలేనట్లే..!
x

Honor Power 2: 10080mAh బ్యాటరీతో హానర్ పవర్ 2.. ఇక ఛార్జర్‌తో పనేలేనట్లే..!

Highlights

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పుడు చిన్న బ్యాటరీలు సరిపోవు అనే స్థాయికి యూజర్ల అంచనాలు చేరుకున్నాయి.

Honor Power 2: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పుడు చిన్న బ్యాటరీలు సరిపోవు అనే స్థాయికి యూజర్ల అంచనాలు చేరుకున్నాయి. రోజంతా ఫోన్ చేతిలో ఉండే పరిస్థితుల్లో, బ్యాటరీ బ్యాక్‌అప్‌నే నిజమైన పవర్‌గా భావిస్తున్నారు. అలాంటి టైమ్‌లో హానర్ కంపెనీ తన కొత్త మిడ్ రేంజ్ ఫోన్ హానర్ పవర్ 2ను చైనాలో విడుదల చేయడానికి సిద్ధమైంది. గత ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన హానర్ పవర్‌కు కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్, హానర్ బ్రాండ్‌లో ఇప్పటివరకు వచ్చిన వాటిలోనే అతిపెద్ద బ్యాటరీతో రానుంది అనే అంశమే ఇప్పుడు పెద్ద హైలైట్‌గా మారింది.

టీజర్ పోస్టర్లలో కనిపిస్తున్న డిజైన్ చూస్తే, హానర్ పవర్ 2 పూర్తిగా ప్రీమియం లుక్‌తో రాబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వెనుక భాగంలో పెద్ద కెమెరా ఐలాండ్ ఉంటుంది. ఈ డిజైన్ చాలా వరకు ఐఫోన్ 17 ప్రో స్టైల్‌ను గుర్తు చేస్తోంది. రంగుల విషయానికి వస్తే బ్లాక్, ఆరెంజ్, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఫోన్‌ అందుబాటులోకి రానుంది. వీటికి సంబంధించిన అధికారిక మార్కెటింగ్ పేర్లు మాత్రం ఇంకా వెల్లడించలేదు. లీక్ అయిన వివరాల ప్రకారం, హానర్ పవర్ 2లో 6.79 ఇంచుల LTPS ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్‌తో, 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా 8,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల అవుట్‌డోర్‌లో కూడా క్లియర్ విజిబిలిటీ ఉండే అవకాశం ఉంది. వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, స్క్రోలింగ్ అన్ని సందర్భాల్లో ఇది స్మూత్ అనుభవాన్ని ఇస్తుందని అంచనా.

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎలైట్ చిప్‌సెట్‌ను హానర్ ఉపయోగిస్తోంది అని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ప్రాసెసర్ రోజువారీ వాడకంతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో కూడా తగినంత పర్‌ఫార్మెన్స్ ఇవ్వగలదని భావిస్తున్నారు. పెద్ద బ్యాటరీకి తగినట్లుగా పవర్ ఎఫిషియెన్సీపై కూడా ఈ చిప్ మంచి బ్యాలెన్స్ ఇవ్వనుందని అంచనా. హానర్ పవర్ 2లో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వవచ్చని లీకులు చెబుతున్నాయి. కెమెరా స్పెసిఫికేషన్లు పూర్తిగా ఫ్లాగ్‌షిప్ స్థాయిలో కాకపోయినా, మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో డైలీ ఫోటోగ్రఫీకి సరిపడే స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

హానర్ పవర్ 2 ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10పై పనిచేసే అవకాశముంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్లు, హానర్ కస్టమైజేషన్లతో ఈ ఫోన్‌ సాఫ్ట్‌వేర్ పరంగా కూడా అప్డేటెడ్ అనుభవాన్ని ఇవ్వనుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఫోన్‌ మందం కేవలం 7.98mm మాత్రమే ఉండొచ్చని సమాచారం. వెయిట్ సుమారు 216 గ్రాములు ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ సైజ్‌ను చూస్తే, ఇది మంచి ఇంజినీరింగ్ బ్యాలెన్స్‌గా చెప్పుకోవచ్చు. హానర్ పవర్ 2లో ప్రధాన ఆకర్షణ దాని 10,080mAh బ్యాటరీ. ఇది హానర్ కంపెనీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ఏ ఫోన్‌లోనూ లేని స్థాయి బ్యాటరీ కెపాసిటీ.

కంపెనీ చెబుతున్న గణాంకాల ప్రకారం, ఈ ఫోన్‌ ఒకే ఛార్జ్‌తో 20.3 గంటల స్క్రీన్ టైమ్ ఇవ్వగలదని, షార్ట్ వీడియోలు చూస్తే దాదాపు 22 గంటల వరకూ కొనసాగుతుందని, గేమింగ్‌లో కూడా 14.2 గంటల వరకూ బ్యాటరీ నిలబడుతుందని చెబుతోంది. రోజూ ఛార్జర్ కోసం వెతకాల్సిన పరిస్థితి లేకుండా ఉండాలి అనుకునే వారికి ఇది నిజంగా పెద్ద ప్లస్‌గా మారే అవకాశం ఉంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఛార్జింగ్ విషయంలో హానర్ రాజీ పడలేదు. హానర్ పవర్ 2లో 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అదనంగా 27W రివర్స్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఇతర డివైసులను కూడా ఈ ఫోన్‌ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కలయిక మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది.

హానర్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, హానర్ పవర్ 2 చైనాలో జనవరి 5న విడుదల కానుంది. స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 7:30కి ఈ ఈవెంట్ ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం ఇది సాయంత్రం 5 గంటలకు సమానం. లాంచ్ తేదీ దగ్గర పడుతుండటంతో, ఇప్పటికే టీజర్లు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. కానీ ధర గురించి మాత్రం అధికారికంగా బయటకు రాలేదు. గత ఏడాది వచ్చిన హానర్ పవర్‌లో 8,000mAh బ్యాటరీ ఉండేది. ఆ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 12జిబి ర్యామ్ వరకు సపోర్ట్ ఉండేది. ఇప్పుడు హానర్ పవర్ 2లో బ్యాటరీ సైజ్ పెరగడమే కాకుండా, ఛార్జింగ్ స్పీడ్ కూడా ఓ రేంజ్ పెంచేసింది. ఈ మార్పులు చూసినప్పుడు, ఇది కేవలం అప్‌గ్రేడ్ మాత్రమే కాదు, పూర్తిగా కొత్త లెవల్ పవర్ ఫోన్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాటరీ లైఫ్‌నే ప్రాధాన్యంగా చూసే యూజర్లకు ఇది ఒక సాలిడ్ ఆప్షన్‌గా మారనుంది. లాంచ్ తర్వాత ధర వివరాలు బయటకు వచ్చిన తర్వాత, ఈ ఫోన్ నిజంగా ఎంత వరకు వాల్యూ ఇస్తుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories