Honor GT Pro: హానర్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మీరు ఊహించలేరంతే.. ఏప్రిల్ 23న లాంచ్..!

Honor GT Pro Launch on April 23 Color Options and Design Revealed
x

Honor GT Pro: హానర్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మీరు ఊహించలేరంతే.. ఏప్రిల్ 23న లాంచ్..!

Highlights

Honor GT Pro: స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో హానర్ స్మార్ట్‌ఫోన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇటీవల కాలంలో హానర్ ఎటువంటి కొత్త మోడళ్లను రిలీజ్ చేయలేదు.

Honor GT Pro: స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో హానర్ స్మార్ట్‌ఫోన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇటీవల కాలంలో హానర్ ఎటువంటి కొత్త మోడళ్లను రిలీజ్ చేయలేదు. కానీ ప్రస్తుతం యూజర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ సూపర్ ఫీచర్స్‌తో నయా స్మార్ట్‌ఫోన్‌ 'Honor GT Pro'ను వచ్చే వారం చైనాలో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కూడి ప్రకటించింది. కొత్త హానర్ టాబ్లెట్ జిటితో పాటు లాంచ్ చేయనుంది. కంపెనీ హానర్ జిటి ప్రో.. డిజైన్, కలర్ ఆప్షన్‌లను వెల్లడించే అధికారిక ఫోటోలను షేర్ చేసింది. ఇది మూడు కలర్ ఆప్షన్‌లలో వస్తుందని తెలుస్తుంది. డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, మెటల్ మిడిల్ ఫ్రేమ్‌ సపోర్ట్‌తో వస్తుందని వెల్లడించింది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Honor GT Pro Launch Date

హానర్ జిటి ప్రో ఏప్రిల్ 23న చైనాలో విడుదల కానుంది. లాంచ్ ఈవెంట్ స్థానిక సమయం మధ్యాహ్నం 2:30 గంటలకు (IST మధ్యాహ్నం 12 గంటలకు) ప్రారంభమవుతుంది. హ్యాండ్‌సెట్ హానర్ టాబ్లెట్ జిటితో పాటు లాంచ్ అవుతుంది.

Honor GT Pro Specifications

హానర్ చైనాలోని దాని అధికారిక స్టోర్ ద్వారా జిటి ప్రో ప్రీ బుకింగ్ కూడా ప్రారంభించింది. లిస్టింగ్ మూడు కలర్ ఆప్షన్‌లను చూపిస్తుంది - బర్నింగ్ స్పీడ్ గోల్డ్, ఐస్ క్రిస్టల్, ఫాంటమ్ బ్లాక్. అధికారిక టీజర్ ద్వారా ఫోన్‌లో నాలుగు కెమెరా సెన్సార్లు, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్, జిటి బ్రాండింగ్ ఉన్న వెనుక కెమెరా మాడ్యూల్‌ ఉంటాయి. సెల్ఫీ షూటర్‌ కోసం ఫ్లాట్ డిస్‌ప్లే, మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ ఉంది.

హానర్ జిటి ప్రో మార్కెట్లో హానర్ జిటి సక్సెసర్‌గా వస్తుంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఇది రినో గ్లాస్ ప్రొటెక్షన్‌తో ఒయాసిస్ పోలరైజ్డ్ ఐ ప్రొటెక్షన్ గేమింగ్ స్క్రీన్‌ను ప్యాక్ చేస్తుంది. హ్యాండ్‌సెట్ మెటల్ మిడిల్ ఫ్రేమ్‌, డ్యూయల్ స్పీకర్‌లతో లాంచ్ అవుతుంది.

హానర్ జిటి ప్రో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫోన్‌లో 100W వైర్డ్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.

Honor GT Pro Price

హానర్ జిటి ప్రో 12జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ మోడల్ CNY 2,199 (సుమారు రూ. 25,000). ఇదే ధరతో కంపెనీ గతేడాది హానర్ జిటిని తీసుకొచ్చింది. ఈ మొబైల్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. అలానే 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,300mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories